Health Tips: ఈ అలవాట్ల వల్ల తలనొప్పి పెరుగుతుంది.. నివారించాలంటే ఇలా చేయండి..!

Health Tips: నేటి కాలంలో నిత్యం తలనొప్పితో బాధపడేవారు పెరుగుతున్నారు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగం చేసే వ్యక్తులు దీనిబారిన ఎక్కువగా పడుతున్నారు.

Update: 2023-11-17 16:00 GMT

Health Tips: ఈ అలవాట్ల వల్ల తలనొప్పి పెరుగుతుంది.. నివారించాలంటే ఇలా చేయండి..!

Health Tips: నేటి కాలంలో నిత్యం తలనొప్పితో బాధపడేవారు పెరుగుతున్నారు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగం చేసే వ్యక్తులు దీనిబారిన ఎక్కువగా పడుతున్నారు. మైగ్రేన్ కారణంగా తీవ్రమైన తలనొప్పి వస్తుంది. తర్వాత మెదడు పనిచేయడం ఆగిపోతుంది. భారంగా మారుతుంది. ఈ పరిస్థితిలో ఎలాంటి పనిచేయలేరు. వాంతులు, మైకము ఎదురవుతాయి. దీనిని నివారించడానికి కొన్ని అలవాట్లను వదిలేయాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

టెన్షన్‌ వద్దు

ఆధునిక కాలంలో పని ఒత్తిడి కారణంగా టెన్షన్‌ సహజమే. ఇది మాత్రమే కాదు కుటుంబ సమస్యల వల్ల కూడా తలనొప్పి పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ఒత్తిడికి లోనుకావొద్దు. ప్రశాంతంగా ఉండాలి. ఇందుకోసం యోగా, మెడిటేషన్‌ వంటివి చేయాలి.

మంచి నిద్ర

ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజులో దాదాపు 7 నుంచి 8 గంటలపాటు నిద్రపోవాలని వైద్యులు చెబుతున్నారు. తక్కువ సమయం నిద్రపోతే మైగ్రేన్‌ను ఆహ్వానిస్తున్నట్టే. అందువల్ల రోజులో సరిపోయే నిద్రపోవాలని గుర్తుంచుకోండి.

సూర్యకాంతి

ఎండాకాలంలో మైగ్రేన్ సమస్య మరింత ఎక్కువవుతుంది. సాధారణంగా ఎండలో ఎక్కువసేపు నిలబడినా, పనిచేసినా తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ఇలాంటి సమయంలో బయటకు వెళ్లవలసి వస్తే గొడుగు ఉపయోగించాలి.

జీర్ణక్రియ ఆరోగ్యం

కడుపు నొప్పి అనేక వ్యాధులకు కారణమవుతుందని తరచుగా వైద్యులు హెచ్చరిస్తుంటారు. వీటిలో మైగ్రేన్ కూడా ఒకటి. ఎసిడిటీ, గ్యాస్ మైగ్రేన్ ప్రమాదాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఫైబర్ అధికంగా అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం చేయాలి.

Tags:    

Similar News