Pomegranate: దానిమ్మ తొక్కలను పడేస్తున్నారా.? ఇకపై అలా చేయకండి..
Pomegranate: దానిమ్మ.. రుచితో పాటు ఆరోగ్యంలో భేష్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Pomegranate: దానిమ్మ.. రుచితో పాటు ఆరోగ్యంలో భేష్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దానిమ్మలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. అయితే దానిమ్మ తినే సమయంలో పైన ఉండే పొట్టును పడేస్తుంటాం. కానీ దానిమ్మ తొక్కలో టీ చేసుకొని తాగితే మరిన్ని లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ తొక్కతో చేసే టీతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
దానిమ్మ తొక్కలను వేడి నీటిలో వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిని చల్లార్చి, వడకట్టి తాగాలి. ఇలా క్రమంతప్పకుండా తీసుకుంటే చర్మం డీటాక్స్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ తొక్కల్లో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. పింపుల్స్, ర్యాషెస్ వంటి సమస్యలు దూరమవుతాయి. చర్మం డీటాక్సిఫికేషన్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా దానిమ్మ తొక్కల టీ ఉపయోగపడుతుంది. దానిమ్మ తొక్కలతో తయారు చేసి టీని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇక గుడ్ కొలెస్ట్రాల్ పెరగడంలో కూడా దానిమ్మ తొక్కల టీ బాగా ఉపయోగపడుతుంది. ఇక వీటితో క్యాన్సర్‌కు కూడా చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్రెస్ట్ కేన్సర్, ప్రోస్టేట్ కేన్సర్, పేగుల క్యాన్సర్‌ను దూరం చేయడంలో దానిమ్మ తొక్క టీ ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు.
నిత్యం జలుబు, దగ్గుతో బాధపడేవారికి కూడా దానిమ్మ తొక్కల టీ బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలు, కఫం సమస్యతో బాధపడేవారు దానిమ్మ తొక్కల టీని తీసుకోవాలని చెబుతున్నారు. గొంతు ఇన్ఫెక్షన్, గొంతులో నొప్పి వంటి సమస్యలను దూరం చేస్తుంది. డయాబెటిస్ వ్యాధితో ఇబ్బందిపడేవారికి కూడా ఈ టీ మేలు చేస్తుంది. క్రమం తప్పకుండా ఈ టీని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్‌లోకి వస్తాయి. అలాగే కొలెస్ట్రాల్ తగ్గి గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.