Thyroid: థైరాయిడ్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు పాలు తాగడం మంచిదో కాదో ఎంతో మంది సందేహ పడుతుంటారు. వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మహిళలే కాదు పురుషులు కూడా థైరాయిడ్ సమస్య బారినపడుతున్నారు. ఈ సమస్య ఉంటే రోజూ మందులు వాడటంతోపాటు కొన్నిరకాల ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. అలాగే థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నవారు పాలు తాగవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. పాలు థైరాయిడ్ సమస్యను పెంచుతుందని చాలా మంది నమ్ముతుంటారు. అయితే ఇందులో నిజమెంతో తెలుసుకుందాం.
థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయకపోవడం లేదంటే అధికంగా ఉత్పత్తి చేయడం వల్ల థైరాయిడ్ సమస్య పెరుగుతుంది. థైరాయిడ్ గ్రంథి చురుకుగా ఉండేందుకు వైద్యుల మందులు ఇస్తారు. అయితే పాలు లేదా కాల్షియం అధికంగా ఉండే ఫుడ్ తీసుకోవడం మంచిదో కాదో అని అలోచిస్తుంటారు. దీనికి గురించి వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు బరువు త్వరగా పెరుగుతారు. లేదంటే తగ్గుతారు. వీరికి మూడ్ స్వింగ్స్ కూడా వస్తుంటాయి. అలాగే జట్టు రాలిపోతుంది. తీవ్రంగా అలసట ఉంటుంది. థైరాయిడ్ సమస్య రెండు రకాలు ఉంటుంది. హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. హైపో థైరాయిడిజం వల్ల బరువు పెరుగుతారు. హైపర్ థైరాయిడిజం ఉంటే బరువు తగ్గి సన్నగా మారుతారు.
పాలలో అయోడిన్ ఉంటుంది. ఈ సందర్భంలో ఇది థైరాయిడ్ గ్రంథిని చురుకుగా ఉంచేందుకు సహాయపడుతుంది. అదే సమయంలో బలవర్థకమైన పాల ఉత్పత్తుల్లో విటమిన్ డి ఉంటుంది. ఇది థైరాయిడ్ పనితీరును సరిచేయడానికి సహాయం చేస్తుంది. ఇది టీఎస్ హెచ్ స్థాయిని కూడా సరిచేస్తుంది. కాబట్టి పాలు, పాల ఉత్పత్తులను పలుమార్లు తీసుకోవడం మేలు. కాబట్టి పాలు తాగడానికి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ గ్లాసుడు పాలు తాగడం అలవాటు చేసుకుంటే మేలు.
ఎండోక్రైన్ సొసైటీ నివేదిక ప్రకారం..ఒక గ్లాసు పాలు తాగడం వల్ల శరీరంలో లైవో థైరాక్సిన్ మందు తగ్గుతుంది. అంటే పాలు తాగడం వల్ల పూర్తి మోతాదులో ఔషధంలో శరీరంలో శోషించుకోలేదు. థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోతే లైవోథైరాక్సిన్ మందు ఎక్కువగా ఇస్తుంటారు.
రీసెర్చ్ ప్రకారం..ఈ మందు తినడానికి నాలుగు నుంచి ఆరు గంటల ముందు పాలు తీసుకోవడం వల్ల శరీరంలో శోషణ జరుగుతుంది. అదే సమయంలో శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. థైరాయిడ్ పనితీరు కూడా మెరుగుపడుతుంది. కాబట్టి థైరాయిడ్ టాబ్లెట్ వేసుకునేందుకు పాలు తాగడానికి మధ్య కనీసం 6 గంటల గ్యాప్ ఉండేలా చూసుకోండి.
పాలు రోజూ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ పాలు తాగేవారికి కాల్షియం లోపం రాకుండా ఉంటుంది.
ఈ సమాచారం ఆరోగ్యంపై ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యల విషయంలో వైద్యులను సంప్రదించడమే ఉత్తమం.