Smoking and Pregnancy: గర్భిణీలు స్మోకింగ్ చేస్తే.. ఏమవుతుంతో తెలుసా.?

Smoking and Pregnancy: స్మోకింగ్ ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు స్మోకింగ్‌ ప్రధాన కారణం.

Update: 2024-10-16 05:30 GMT

Smoking and Pregnancy

Smoking and Pregnancy: స్మోకింగ్ ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు స్మోకింగ్‌ ప్రధాన కారణం. అందుకే ఈ అలవాటును మానుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. గుండె సంబంధిత సమస్యలు మొదలు ఎముకలు, మెదడు ఆరోగ్యంపై కూడా స్మోకింగ్ తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

అయితే గర్భిణీలు ఒకవేళ స్మోకింగ్ చేస్తే మరింత ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా చైనాకు చెందిన ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్మోకింగ్‌ వల్ల గర్భిణులకు తీవ్ర అనర్థాలు తప్పవని అంటున్నారు. సిగరెట్ పొగలో ఏకంగా నాలుగు వేల రకాల రసాయనాలు ఉంటాయి.

సాధారణంగా స్మోకింగ్ చేసే వారిలో ఈ రసాయనాలు రక్తంలో కలిసిపోతాయి. దీంతో ఈ రసాయనాలు ప్లాసెంటా ద్వారా కడుపులోని పిండాన్ని చేరుతాయి. ఇది శిశువు ఎగుదలకు, మానసిక అభివృద్ధికి తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తాయని అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా స్మోకింగ్ చేయడం వల్ల గర్బిణీ హృదయ స్పందనల రేటుపై కూడా ప్రభావం పడుతుంది. దీంతో డెలివరీ సమయంలో తల్లి ఆరోగ్యంపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

అయితే గర్భం దాల్చకముందు సిగరెట్ అలవాటు ఉండి. గర్భం దాల్చిన తర్వాత మానేసినా ఈ సమస్య వచ్చే అవకాశం 27 శాతం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. గర్భం దాల్చిన సమయంలో కూడా స్మోకింగ్ చేస్తే ఈ ముప్పు 31 శాతం నుంచి 32 శాతం వరకు ఉంటుందని సర్వేలో తేలింది. గర్భిణీలు స్మోకింగ్ చేస్తే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై కచ్చితంగా నేరుగా ప్రమాదం పడుతుందని, తల్లి కావాలనుకునే వారు కనీసం 6 నెలల ముందు నుంచి ఈ అలవాటును మానేయడం ఉత్తమం అని చెబుతున్నారు.

Tags:    

Similar News