Thyroid: కళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? థైరాయిడ్ కావొచ్చు

Thyroid Problems: పురుషులతో పోల్చితే మహిళల్లో థైరాయిడ్ (Thyroid) వచ్చే సమస్య ఎక్కవగా ఉంటుందని తెలిసిందే.

Update: 2024-11-09 16:30 GMT

Thyroid: కళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? థైరాయిడ్ కావొచ్చు

Thyroid Problems: పురుషులతో పోల్చితే మహిళల్లో థైరాయిడ్ వచ్చే సమస్య ఎక్కవగా ఉంటుందని తెలిసిందే. అయితే చాలా మంది థైరాయిడ్ సమస్య ఉందని తెలియగానే కంగారు పడిపోతుంటారు. ఇక ఆ వ్యాధి నుంచి బయటపడడం అంత సులువు కాదని అనుకుంటారు. కానీ సరైన జీవన విధానం, సరైన మెడికేషన్‌తో థైరాయిడ్ సమస్య ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే సమస్యను ముందుగా గుర్తించడం వల్ల మరింత మెరుగైన ఫలితం పొందొచ్చని అంటున్నారు. కంటిలో కనిపించే కొన్ని లక్షణాల ద్వారా థైరాయిడ్‌ను ముందుగానే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

నిజానికి థైరాయిడ్‌ అంటే వ్యాధి పేరు కాదు. ప్రతీ ఒక్కరి శరీరంలో ఉండే ఒక భాగం. ఈ థైరాయిడ్ గ్రంథి గొంతు కింది భాగంలో ఉంటుంది. థైరాయిడ్ శరీరాన్ని నడపడానికి హార్మోన్లను విడుదల చేస్తుంది. దీని వల్ల రక్తపోటు, గుండె కొట్టుకోవడం, సెక్స్ డ్రైవ్, పీరియడ్స్, గర్భం, ఆనందం, దుఃఖం వంటి ఎమోషన్స్‌ నిర్ణయించబడుతాయి. థైరాయిడ్‌ గ్రంథిలో అసమతుల్యత ఏర్పడినప్పుడు వ్యాధి సంభవిస్తుంది.

* థైరాయిడ్‌ సమస్య ఉన్న వారిలో కళ్ల చుట్టూ ఉన్న భాగాలు, లేదా కణజాలాలు దెబ్బ తింటాయి. దీంతో కళ్లి ఉబ్బినట్లు కనిపిస్తాయి. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

* ఇక థైరాయిడ్‌ ఎక్కువైనా తక్కువైనా కళ్ళు లోపలికి వెళ్తాయి. కళ్లు చిన్నగా మారుతాయి. అలాగే కళ్లు ఎర్రగా మారి వాపు కనిపిస్తుంది. నిత్యం కంటి నుంచి నీరు కూడా కారుతుంది.

* హైపర్ థైరాయిడిజం కారణంగా కంటి చూపు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా దృష్టి తగ్గుతుంది. అస్పష్టంగా కనిపిస్తుంది. దీనిని గ్రేవ్స్ ఆప్తాల్మోపతి అని కూడా అంటారు. ఇది కాకుండా, థైరాయిడ్ సమస్య కారణంగా కళ్లలో నొప్ వేధిస్తుంటుంది.

థైరాయిడ్ సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య ఇటీవల ఎక్కువవుతోంది. అయితే ఈ సమస్యను త్వరగా గుర్తిస్తే చికిత్స సులభతరమవుతుంది. శరీరంలో థైరాయిడ్ సమస్యను కళ్లలో కనిపించే కొన్ని ముందస్తు లక్షణాల ద్వారా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Tags:    

Similar News