Blood Type Diet: బ్లడ్‌ గ్రూప్‌ ఆధారంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా.?

Blood Type Diet: ఏ బ్లడ్‌ గ్రూప్‌ వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయాన్ని కూడా నిపుణులు వర్గీకరించారు.

Update: 2024-11-18 16:30 GMT

Blood Type Diet

Blood Type Diet: ప్రతీ మనిషికి ఒక రకమైన బ్లడ్‌ గ్రూప్‌ ఉంటుందనే విషయం తెలిసిందే. పలాన బ్లడ్ గ్రూప్‌ ఉన్న వారు అదే బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న వారి రక్తాన్ని స్వీకరించే అవకాశం ఉంటుంది. అయితే మనిషి రక్తంలోని రక్త కణాల ఉపరితలంపై ఉన్న ప్రోటీన్ల ఆధారంగా విభిన్న బ్లడ్ గ్రూప్‌ను నిర్ణయిస్తారు. మొత్తం నాలుగు రకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయని మనందరికీ తెలిసిందే. A, B, AB, O ఇలా నాలుగు రకాలు రక్తాన్ని విభజించారు.

అయితే మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందన్న విషయంలో ఎంత నిజం ఉందో.. ఏ బ్లడ్‌ గ్రూప్‌ వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయాన్ని కూడా నిపుణులు వర్గీకరించారు. మన బ్లడ్‌ గ్రూప్‌ ఆధారంగా ఆహారాన్ని తీసుకుంటే మంచి జరుగుతుందని అంటున్నారు. ఇంతకీ ఏ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.? ఇప్పుడు తెలుసుకుందాం..

♦ ఎ బ్లడ్ గ్రూప్‌ ఉన్నవారు ఎక్కువగా పండ్లు, కూరగాయాలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే గింజలు, గోధుమలు వంటి ఆహారాలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు.

♦ ఇక బీ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న వారు పౌల్ట్రీ, చేపలు, పాల ఉత్పత్తులను ఆహారంలో భాగం చేసుకుంటే మంచిదని చెబుతున్నారు. అలాగే పడ్లు, కూగరాయలు కూడా ఈ బ్లడ్ గ్రూప్‌ వారికి మేలు చేస్తాయని అంటున్నారు.

♦ ఏబీ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న వారు తీసుకునే ఆహారంలో చేపలు, రొయ్యలు, సీ ఫుడ్ వంటివి భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇందులోని ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఏబీ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న వారికి ఎంతగానో ఉపయోగపడతాయి.

 ఓ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న వారు మాంసం, చేపలు, కూరగాయలను ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చికెన్, గొర్రె, ఆకుకూరలు, బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజ్, బెర్రీలు వంటి తీసుకోవాలని సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్‌ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా అందించినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Tags:    

Similar News