Kidney Disease: నిద్రలేవగానే ఈ లక్షణాలున్నాయా.? కిడ్నీ సమస్యలు ఉన్నట్లే..
Kidney Disease: ముఖ్యంగా ఉదయం నిద్రలేవగానే కనిపించే కొన్ని లక్షణాలు మన కిడ్నీ ఆరోగ్యం దెబ్బతింటోందని అర్థం చేసుకోవాలని చెబుతున్నారు.
Kidney Disease: తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, జీవనశైలిలో మార్పుల కారణంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా కూల్ డ్రింక్స్ తాగడం, అపరిశుభ్రమైన నీరు, ఆల్కహాల్ వంటి అలవాట్లు కిడ్నీల పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే కిడ్నీల పనితీరు దెబ్బతింటే శరీరం ముందుగానే కొన్ని లక్షణాలతో అలర్ట్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం నిద్రలేవగానే కనిపించే కొన్ని లక్షణాలు మన కిడ్నీ ఆరోగ్యం దెబ్బతింటోందని అర్థం చేసుకోవాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* మూత్ర విసర్జనలో వచ్చే మార్పుల ఆధారంగా కూడా కిడ్నీ సమస్యలను ముందుగానే పసిగట్ట వచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం నిద్రలేవగానే మూత్రం రంగు పసుపులోకి మారినా. నురగ వస్తున్నా మూత్రపిండాల సమస్యలకు సంకేతంగా భావించాలి. ఇలాంటి లక్షణాలు దీర్ఘకాలంగా కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి. వైద్యులను సంప్రదించాలి.
* ఉదయం నిద్రలేచిన వెంటనే.. కడుపులో వాపు లేదా తిమ్మిరిని అనుభవిస్తే, అది మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడానికి సంకేతం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణం కనిపిస్తే వైద్యుల సలహాలు తీసుకోవాలి.
* ఇక ఉదయం నిద్రలేచిన వెంటనే బాగా దాహం వేస్తుంటే కూడా కిడ్నీ ఫెయిల్యర్‌కు సంకేతంగా భావించాలని అంటున్నారు. కిడ్నీ సమస్యల కారణంగా, శరీరంలో నీటి సమతుల్యత కొరవడుతుంది. ఇది దాహం వేయడానికి కారణమవుతుంది.
* సాధారణంగా రాత్రంగా నిద్రపోయి ఉదయాన్నే లేస్తే శరీరం యాక్టివ్‌గా ఉండాలి. కానీ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే మాత్రం కిడ్నీల పనితీరులో ఏదో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి.
* కిడ్నీ సమస్యల కారణంగా, శరీరంలో టాక్సిన్ పేరుకుపోతాయి. ఇది చర్మంపై దురద, దద్దుర్లు వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే.. ఈ సమస్య ఉంటే మాత్రం కిడ్నీ సంబంధిత పరీక్షలు చేయించుకోవాల్సిందే.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.