Hair Care Tips: కలబందతో జుట్టుకు అందం, ఆరోగ్యం
Hair Care Tips With Aloe Vera: కలబందలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. కలబందను ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు.
Hair Care Tips With Aloe Vera: కలబందలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. కలబందను ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా కలబందలో అనేక విటమిన్లు, మినరల్స్ అధిక మొత్తంలో ఉంటాయి. కలబందలోని విటమిన్ ఏ, సీ, బీ1, బీ3 మొదలైనవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కలబంద శరీరానికి మాత్రమే కాదు జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు.
ప్రస్తుత కాలంలో జుట్టు సమస్యలు సర్వ సాధారణంగా మారిపోయాయి. ఎంత కేర్ తీసుకున్నా జుట్టు విపరీతంగా రాలిపోతుంది. అందుకు విటమిన్స్, ప్రొటీన్స్ లోపం ఒక కారణమైతే.. వాతావరణ కాలుష్యం మరో కారణం అని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా శీతాకాలంలో జుట్టు కుదుళ్లలోని చర్మం పొడిబారిపోవడం వల్ల చుండ్రు సమస్యలు వస్తాయి. ఈ సమస్య తీవ్రమైతే జుట్టు దృఢత్వాన్ని కోల్పోయి ఎక్కువగా రాలిపోయే ప్రమాదం ఉంటుందంటున్నారు నిపుణులు.
అయితే ఇలాంటి సమస్యలను దూరం చేయడంలో కలబంద ఎంతో బాగా పనిచేస్తుందంటున్నారు. చుండ్రు తగ్గించడంలో జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేయడంలో బాగా ఉపయోగపడుతుందంటున్నారు. అలోవెరా (కలబంద), కొబ్బరి నూనె రెండూ జుట్టు సంరక్షణలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే మినెరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు జుట్టును తేమగా, బలంగా ఉంచేందుకు సహాయం చేస్తాయి. చుండ్రుని తగ్గించి, జుట్టు రాలకుండా, చివర్లు చిట్లకుండా, జుట్టు సిల్కీగా ఉంటుందంటున్నారు. అంతే కాకుండా జుట్టు మెత్తగా, షైనీగా తయారయేలా చేస్తాయంటున్నారు.