Beer Side Effects: బీర్ తెగ లాగించేస్తున్నారా? శరీంలో జరిగే మార్పులివే..
Beer Side Effects: రెగ్యులర్‌గా బీర్ (Beer) తాగడం ఆరోగ్యానికి (health) మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. బీరు ఎక్కువగా తాగడం వల్ల ఊబకాయం వస్తుందని చెబుతున్నారు.
Beer Side Effects: నలుగురు ఫ్రెండ్స్ ఒక చోట చేరినా, ఆదివారం వచ్చినా వెంటనే చల్లగా ఒక బీర్ వేద్దామని అనుకుంటారు. ముఖ్యంగా యూత్ ఎక్కువగా బీర్ తాగేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే చాలా మంది లిక్కర్‌తో పోల్చితే బీర్ తాగడం ఆరోగ్యంపై పెద్దగా ప్రతికూల ప్రభావం చూపదనే భావనలో చాలా మంది ఉంటారు. ఇంతకీ బీర్ తాగడం నిజంగానే ఆరోగ్యానికి మంచిదా.? రెగ్యులర్‌గా బీర్ తాగితే శరీరంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
రెగ్యులర్‌గా బీర్ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. బీరు ఎక్కువగా తాగడం వల్ల ఊబకాయం వస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా బీర్ తీసుకోవడం వల్ల ఎక్కువగా ఆకలి అవుతుంది. దీంతో సహజంగానే ఎక్కువగా తింటుంటాం. ఇది ఊబకాయం, పొట్టకు దారి తీస్తుందని అంటున్నారు. ఇక బీరును రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మెదు సామర్థ్యం దెబ్బ తింటుందని నిపుణులు చెబుతున్నారు. బీర్‌లోని ఆల్కహాల్ న్యూరోట్రాన్స్‌మిటర్ల పనితీరుకు అడ్డంకిగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
బీర్ ఎక్కువగా తీసుకుంటే జ్ఞాపకశక్తి తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆల్కహాల్ డిప్రెషన్‌కు దారి తీస్తుందని అంటున్నారు. సెరటోనిన్, డోపమైన్ మధ్య నియంత్రణ పట్టాలు తప్పేలా చేస్తుంది. ఇది ఒత్తిడి పెరగడానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. బీర్ వల్ల మెదడులో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. వయసు మళ్లిన వారిలో అల్జీమర్స్‌కు ఇది దారి తీస్తుందని అంటున్నారు. బీర్ తాగితే నిద్రలేమికి కూడా దారి తీస్తుందని అంటున్నారు.
ఇక బీర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌కు దారి తీస్తుందని అంటున్నారు. ఇది చర్మ ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. చర్మం నిగారింపును కోల్పోతుతుంది. నిత్యం బీర్ తాగే వారిలో లివర్, గుండె సంబంధిత సమస్యల బారిన పడే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నోట్: పైన తెలిపిన వివరాలు ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా అందించిన సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.