Flax Seeds: ఈ గింజలను రోజూ ఒక స్పూన్‌ తినండి.. మార్పు ఊహకు కూడా అందదు..!

Flax Seeds: ప్రస్తుతం ఆరోగ్యంపై చాలా మందికి అవగాహన పెరుగుతోంది. దీంతో తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పడుతున్నారు.

Update: 2024-10-14 11:43 GMT

Flax Seeds: ఈ గింజలను రోజూ ఒక స్పూన్‌ తినండి.. మార్పు ఊహకు కూడా అందదు..!

Flax Seeds: ప్రస్తుతం ఆరోగ్యంపై చాలా మందికి అవగాహన పెరుగుతోంది. దీంతో తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పడుతున్నారు. ఇందులో భాగంగానే రెగ్యులర్‌ ఫుడ్‌తో పాటు ఆరోగ్యానికి మేలు చేసే సీడ్స్‌ను తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి సీడ్స్‌లో ఆవిసె గింజలు ఒకటి. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ రోజూ ఒక స్పూన్‌ ఆవిసె గింజలను తీసుకోవడం వల్ల శరీరంలో వచ్చే మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్,, థయామిన్, కాపర్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా చేస్తాయి. అలాగే ఇందులోని బి కాంప్లెక్స్‌ విటమిన్లు, విటమిన్‌ ఇ, మెగ్నీషియం చర్మ సంరక్షణతో పాటు ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఇందులో మెగ్నీసియం రక్తపోటును కంట్రోల్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. శరీరంలో రక్త కణాల ఉత్పత్తిలో కూడా అవిసె గింజలు ఉపయోగపడతాయని నిపుణు అంటున్నారు.

ఇక జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. దీనికి కారణం ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌. అవిసె గింజల్లో పుష్కలంగా ఉండే ఫైబర్‌ కంటెంట్‌ మెరుగైన జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో గుండె ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. గుండె పోటు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. ఈ గింజల్లో ఉండే.. యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను అంతం చేస్తాయి. ఫలితంగా కేన్సర్ ముప్పు కూడా తగ్గుతుంది.

డయాబెటిస్‌ సమస్య బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా ప్రతీరోజూ అవిసె గింజలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్రమం తప్పకుండా వీటిని తీసుకుంటే రెగ్యులర్‌ వ్యాధుల బారిన పడకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

Tags:    

Similar News