Health Tips: చికెన్ బిర్యానీ లాగిస్తూ, కూల్ డ్రింక్ తాగుతున్నారా.?

Health Tips: బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగడం సాధారణంగా ప్రతి ఒక్కరు చేసే పని. హాట్ హాట్ బిర్యాని తింటూ, కూల్ కూల్ గా డ్రింక్ తాగితే ఆ మజానే వేరు అని అంటుంటారు బిర్యానీ లవర్స్.

Update: 2024-10-16 12:46 GMT

Health Tips: చికెన్ బిర్యానీ లాగిస్తూ, కూల్ డ్రింక్ తాగుతున్నారా.?

Health Tips: బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగడం సాధారణంగా ప్రతి ఒక్కరు చేసే పని. హాట్ హాట్ బిర్యాని తింటూ, కూల్ కూల్ గా డ్రింక్ తాగితే ఆ మజానే వేరు అని అంటుంటారు బిర్యానీ లవర్స్. అయితే ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ బిర్యానీ తింటూ, కూల్ డ్రింక్ తాగితే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

బిర్యానీ, కూల్ డ్రింక్ కలిపి తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కూల్‌ డ్రింక్‌లో ఉండే కార్బనేషన్ జీర్ణక్రియపై దుష్ప్రభావం చూపుతుంది. అజీర్తి, కడుపులో నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డయాబెటీస్ సమస్యతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లో బిర్యానీ, కూల్ డ్రింక్ కలిపి తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. బిర్యానీలో ఉండే కార్బోహైడ్రేట్స్‌, కొవ్వులు.. కూల్‌ డ్రింక్స్‌లో ఉండే అధిక చక్కెర స్థాయిలు రక్తంలో షుగర్ లెవల్స్‌ పెరగడానికి కారణమవుతాయి. లివర్ తో పాటు కిడ్నీ సంబంధిత వ్యాధులకు కూడా ఇది దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు. కూల్ డ్రింక్స్‌లో ఉండే చక్కెరలు, ప్రిజర్వేటివ్‌లు వీటి పనితీరుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి బిర్యానీ తినే ముందు లేదా తిన్న తర్వాత కనీసం రెండు గంటల గ్యాప్ తోనే కూల్ డ్రింక్స్ తీసుకోవాలని చెబుతున్నారు. 

Tags:    

Similar News