Lifestyle: గురకే కదా అని లైట్ తీసుకోకండి.. ప్రాణాంతక వ్యాధికి దారి తీయొచ్చు..

Lifestyle: గురక అనేది సర్వసాధారణమైన సమస్య. మనలో చాలామంది ఈ సమస్య బారిన పడుతుంటారు.

Update: 2024-10-16 16:00 GMT

 Lifestyle: గురకే కదా అని లైట్ తీసుకోకండి.. ప్రాణాంతక వ్యాధికి దారి తీయొచ్చు..

Lifestyle: గురక అనేది సర్వసాధారణమైన సమస్య. మనలో చాలామంది ఈ సమస్య బారిన పడుతుంటారు. అయితే ఈ సాధారణ సమస్య ప్రాణాంతక వ్యాధికి దారి తీసే అవకాశాలు ఉన్నాయని తాజా అధ్యాయనం చెబుతోంది. గురక సమస్య దీర్ఘకాలంలో క్యాన్సర్ వ్యాదికి దారి తీసే అవకాశాలు ఉన్నాయని తాజా పరిశోధనలో వెళ్లడైంది. ఇంతకీ గురకకు, ప్రాణాంతక వ్యాధికి సంబంధం ఏంటి అనేగా మీ సందేహం అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

నిద్రపోతున్న సమయంలో కొందరికి గొంతు వెనకాల భాగం వదులుగా మారి శ్వాస మార్గానికి అడ్డుపడుతుంది. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. రెట్టించిన వేగంతో శ్వాస తీసుకుంటాము ఇదే గురకకు కారణమవుతుంది. దీనిని వైద్య పరిభాషలో అబ్ స్ట్రాక్టివ్ స్లీప్ అప్నియాగా చెబుతుంటారు. ఈ కారణంగా తాత్కాలికంగా రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. ఇది గుండె సంబంధిత సమస్యలతో పాటు నాడి వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

అయితే దీర్ఘకాలికంగా ఈ సమస్యతో బాధపడే వారిలో జీర్ణకోశ, కిడ్నీ, రొమ్ము క్యాన్సర్ కు దారి తీసే అవకాశాలు సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో భాగంగా అబ్ స్ట్రాక్టివ్ స్లీప్ అప్నియాతో బాధపడుతున్న 1990 మందిని 13 ఏళ్ల పాటు పరిశీలించి, ఈ నిర్ధారణకు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది గురక సమస్యలతో బాధపడుతున్నారని, అయితే చాలామందికి అసలు ఈ సమస్య ఉన్నట్లు కూడా తెలియదని పరిశోధకులు చెబుతున్నారు.

ఇక గురక క్యాన్సర్ కు ఎలా కారణమవుతుందన్న దాని గురించి పరిశోధకులు మాట్లాడుతూ.. రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గడం వల్ల డీఎన్ఏ లో హానికరమైన మార్పులకు కారణం అవుతుందని గుర్తించారు. ఇది క్యాన్సర్ ముప్పు పెరగడానికి ఒక కారణమని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే గురక సమస్యను తీసిపారేయకుండా ముందు నుంచే జాగ్రత్త వహించాలని, వైద్యుల సూచనలతో పాటు, శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు.

Tags:    

Similar News