Dehydration: శరీరంలో ఈ మార్పులా.? మీరు తగినంత నీరు తాగడం లేదని అర్థం
Dehydration: మనం జీవించడానికి గాలి ఎంత ముఖ్యమో.. నీరు కూడా అంతే ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Dehydration: మనం జీవించడానికి గాలి ఎంత ముఖ్యమో.. నీరు కూడా అంతే ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరిపడు నీరు తీసుకోకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. శరీరం డీహైడ్రేషన్‌కు గురైతే ఎన్నో సమస్యలు ఎదుర్కోక తప్పదని నిపుణులు అంటున్నారు. అందుకే కచ్చితంగా ప్రతి రోజూ కనీసం 4 లీటర్ల నీరును తీసుకోవాలని చెబుతున్నారు. శరీరంలో సరిపడ నీరు లేకపోతే కొన్ని లక్షణాల ద్వారా శరీరం మనల్ని అలర్ట్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* నోటి దుర్వాసన వస్తుంటే శరీరం డీహైడ్రేషన్‌కు గురైనట్లు అర్థం చేసుకోవాలి. ఎక్కువసేపు నీరు తాగకపోతే గొంతు పొడి బారుతుంది. దీంతో నోటిలో బ్యాక్టీరియా వ్యాప్తి పెరుగుతుంది. ఈ కారణంగా నోటిలో దుర్వాసన వస్తుంది.
* అన్నం తీసుకున్న కాసేపటికే మళ్లీ ఆకలి వేస్తుండడం కూడా డీ హైడ్రేషన్‌కు లక్షణంగా భావించాలి. డీహైడ్రేషన్‌కు గురైన సమయంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. దీంతో మనకు తెలియకుండానే ఎక్కువగా తినేస్తుంటాం. ఇది బరువు పెరగడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
* నిత్యం గుండె కొట్టుకునే వేగం పెరగడం, శ్వాస తీసుకునే వేగం పెరిగినా శరీరంలో డీహైడ్రేషన్ సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. శరీరంలో నీరు తగ్గితే.. శరీరంలో ప్లాస్మా కౌంట్ కూడా తగ్గుతుంది. రక్త ప్రవాహం పెరుగుతుంది, దీని కారణంగా గుండె కొట్టుకోవడం పెరుగుతుంది.
* దీర్ఘకాలంగా తలనొప్పితో బాధపడుతుంటే శరీరానికి తగినంత నీరు అందడం లేదని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గితే.. మెదడులో రక్త ప్రవాహం, ఆక్సిజన్ లభించదు. ఇది తలనొప్పికి దారి తీస్తుంది.
* చర్మ సంబంధిత సమస్యలు వచ్చినా, చర్మంపై గీతలు, ముడతలు పడుతుంటే, చర్మం పొడిబారినట్లు కనిపించినా.. శరీరం డీహైడ్రేషన్‌కు గురైనట్లు అర్థం చేసుకోవాలని అంటున్నారు.
* జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే కూడా శరీరంలో తగినంత నీరు లేదని అర్థం చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు వెంటాడుతుంటే సరిపడ నీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Lifestyle, Lifestyle news, health, Water, Drinking water, Dehydration symptoms