Raisins: కిస్మిస్‌లను ఇలా తీసుకోండి.. లాభాలు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..!

Raisins: కిస్మిస్‌లు ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని విటమిన్లు, మినరల్స్‌ శరీర నిర్మాణానికి తోడ్పడుతాయి.

Update: 2024-10-19 11:30 GMT

Raisins: కిస్మిస్‌లను ఇలా తీసుకోండి.. లాభాలు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..!

Raisins: కిస్మిస్‌లు ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని విటమిన్లు, మినరల్స్‌ శరీర నిర్మాణానికి తోడ్పడుతాయి. అయితే సహజంగా మనం కిస్మిస్‌లను నేరుగా అలాగే తినేస్తుంటాం. అయితే అలా కాకుండా కిస్మిస్‌ నీటిని తీసుకోవడం వల్ల మరిన్ని గొప్ప ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రంతా కిస్మిస్‌లను నానబెట్టి ఉదయాన్నే పడగడుపు ఆ నీటిని తాగితే శరీరంలో మార్పులు జరుగుతాయని అంటున్నారు. రోజూ ఉదయం పరగడుపున కిస్మిస్ నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ప్రతీరోజూ కిస్మిస్ నీటిని తాగడం వల్ల చర్మం ఆరోగ్యం మెరుగవుతుంది. రోజూ ఈ నీటిని తీసుకోవడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది. ఇందులోని విటమిన్లు, మినరల్స్‌ చర్మం రంగు మెరుగుపడుతుంది. కేశ సంరక్షణకు కూడా ఈ నీరు ఎంతో తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

* రక్త హీనత సమస్యను దూరం చేయడంలో ఈ కిస్మిస్‌ నీరు ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ప్రతీరోజూ ఈ నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్‌ స్థాయిలు పెరుగుతాయి. దీంతో ఎనీమియా సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. ముఖ్యంగా గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది.

* కిస్మిస్‌ నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్‌ సి పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. ప్రతీ రోజూ కిస్మిస్‌ నీటిని తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి సీజనల్‌ వైరల్‌ వ్యాధులు రాకుండా అడ్డుకట్ట వేయడంలో ఉపయోగపడుతుంది.

* లివర్‌ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా కిస్మిస్‌ నీరు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా లివర్‌ డీటాక్స్‌ చేసేందుకు ఈ నీళ్లు బాగా పనిచేస్తాయి. లివర్‌ ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాటును చేసుకోవాలని సూచిస్తున్నారు.

* జీర్ణ సంబంధిత సమస్యలు దూరం కావడంలో కూడా కిస్మిస్‌ నీళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా మలబద్ధకం, ఎసిడిటీ, గ్యాస్‌ వంటి సంబంధితన సమస్యలను దూరం చేయడంలో ఇవి బాగా పనిచేస్తాయి. అంతేకాకుండా బరువు తగ్గడంలో కూడా కిస్మిస్‌ నీళ్లు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

Tags:    

Similar News