Rusk with Tea: ఉదయాన్నే రస్క్‌, టీ తీసుకుంటున్నారా? ఏమవుతుందో తెలుసా?

Rusk with Tea Side Effects: ఉదయాన్నే టీలో రస్క్‌ తినేవారు చాలా మంది ఉంటారు. ఇంకొంతమందికి ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌‌లో తరచుగా టీ, రస్క్ తినే అలవాటు కూడా ఉంటుంది.

Update: 2024-10-21 16:10 GMT

Rusk with Tea Side Effects

Rusk with Tea Side Effects: ఉదయాన్నే టీలో రస్క్‌ తినేవారు చాలా మంది ఉంటారు. ఇంకొంతమందికి ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌‌లో తరచుగా టీ, రస్క్ తినే అలవాటు కూడా ఉంటుంది. అయితే రస్క్‌, టీ కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు కానీ, రోజూ అదే పనిగా తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ రస్క్‌, టీ తీసుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రస్క్‌ తయారీ కోసం పిండి, చక్కెర, పామాయిల్‌ను ఉపయోగిస్తారు. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇవి తినడం వల్ల మలబద్ధకం సమస్యకు దారి తీసే ప్రమాదం కూడా ఉందంటున్నారు. ఇది బరువు పెరగడానికి కూడా కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే ఇందులో వీటిలో తయారీలో ఉపయోగించే గ్లూటెన్‌ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది.

ఇక రస్క్‌ల తయారీలో ఉపయోగించే ట్రాన్స్‌ ఫ్యాన్స్‌ శరీర జీవక్రియపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. వీటివల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు వేగంగా పెరిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. దీర్ఘకాలంలో ఇవి గుండె సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉంటాయనేది నిపుణుల మాట. అధిక మొత్తంలో చక్కెర, పిండి ఉండే ఈ రస్క్‌లు బరువు పెరగడానికి కారణమవుతాయి. అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కూడా దారి తీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అలాగే రస్క్‌ల తయారీలో మైదా పిండిని ఉపయోగిస్తారు. ఉదయం పరిగడుపున మైదాతో చేసిన ఈ ఫుడ్‌ను తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మలబద్దకం, కడుపులో ఉబ్బరం, కడుపులో నొప్పి వంటి సమస్యలు వేధిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీలైనంత వరకు పరిగడుపున కాకుండా సాయంత్రం, అది కూడా రెగ్యులర్‌గా కాకుండా అప్పుడప్పుడు తీసుకుంటే పర్వాలేదని సూచిస్తున్నారు.

గమనిక : పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్‌ వేదికగా ఉన్న సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యులను సంప్రదించి, వారి సూచనలు పాటించడమే మంచిది.

Tags:    

Similar News