Lifestyle: స్టైల్‌గా ఉంటుందని టాటూలు వేసుకుంటున్నారా.? ఎన్ని సమస్యలో తెలుసా..?
Tattoo: నేటితరం యువత ఎంతో ఇష్టపడి టాటూలు వేసుకుంటున్నారు. టాటూ ఒక్కసారి అలవాటైందంటే ఆ ఇష్టం అంత సులభంగా పోవడం కష్టం. అది ఒక్కటితో ఆగిపోదు, శరీరంలో ఎక్కడపడితే అక్కడ టాటూలు వేసుకునే వారు కూడా ఉన్నారు. ఒకప్పుడు కేవలం సెలబ్రిటీలకు మాత్రమే పరిమితమైన ఈ కల్చర్‌ను ఇప్పుడు సామాన్యులు సైతం ఫాలో అవుతున్నారు.
అయితే చూడ్డానికి స్టైల్‌గా కనిపించే టాటూల వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. అందంగా కనిపించే టాటూలు ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయని చెబుతున్నారు. ఇంతకీ టాటూల వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి.? రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? ఇప్పుడు తెలుసుకుందాం.
* సాధారణంగా టాటూ వేసుకున్న చోట చర్మం ఉబ్బి, దద్దుర్లు వస్తాయి. అయితే ఎప్పుడైనా ఎంఆర్‌ఐ స్కాన్ చేయించుకుంటే టాటూ వేసుకున్న చోట స్కాన్ సరిగ్గా కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య అందరిలో కనిపించదని వారివారి చర్మ లక్షణం ఆధారంగా కనిపిస్తుందని అంటున్నారు.
* టాటూ అంటేనే చర్మంలోకి ఇంక్ వెళ్లడం. అయితే కొందరిలో ఈ ఇంక్ బ్లడ్ ఇన్ఫెక్షన్‌కు దారి తీసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఇన్ఫెక్షన్ అయిన సూదిని మరొకరికి ఉపయోగించినా వారికి కూడా సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి టాటూ వేసుకునే ముందు నీడిల్ కొత్తదేనా కాదా అన్న విషయాన్ని నిర్ధారించుకోవాలి.
* ఇక టాటూలో ఉపయోగించే రంగుల్లో ఉపయోగించే కెమికల్స్ కారణంగా కొందరిలో చర్మం ఎరుపెక్కడం, దురద పెట్టడం వంటి లక్షణాలు కనిస్తాయి. అందుకే ఒకవేళ టాటు వేసుకోవాలనే ఇష్టం ఉంటే.. ముందు చర్మ సంబంధిత నిపుణులను సంప్రదించడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
* ఒకరికి టాటూ వేసేందుకు ఉపయోగించిన సూదినే మరొకరి వాడడం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల హెపటైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది.
* టాటూ వేసుకున్న ప్రదేశంలో చెమట పట్టడం తగ్గిపోతుంది. దీంతో శరీర ఉష్ణోగ్రతలతో మార్పులు వస్తాయి. ఇది మెటబాలిజమ్ పై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే టాటూ వేసుకోవాలనే ఆసక్తి ఉంటే చిన్న, చిన్నవి వేసుకుంటే బెటర్.