Pregnancy After 40 : నలభై దాటాక..గర్భం దాల్చడం కష్టమా? ప్రెగ్నెన్సీ రావాలంటే ఈ చిట్కాలు మీకోసం.!

Pregnancy After 40 : నేటి జీవనశైలితో మహిళలు గర్భం దాల్చడం కష్టంగా మారింది. 30ఏండ్లలోపు గర్బం దాల్చాలని వైద్యులు సూచిస్తున్నారు. మహిళలు తమ కెరీర్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడంతో ఆలస్యంగా గర్భం దాల్చుతున్నారు.

Update: 2024-06-20 16:00 GMT

Pregnancy After 40 : 40ఏండ్ల తర్వాత గర్బం దాల్చడమనేది కాస్త కష్టమైన విషయమే. కానీ చాలా మంది ఇలానే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. కెరీర్ మీద ఫోకస్ పెట్టడంతో ఆలస్యం చేస్తున్నారు. కొందరికి ప్రెగ్నెన్సీ అయితే..ఇంకొందరు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. 40ఏండ్ల తర్వాత సంతానం కోసం ప్రయత్నిస్తున్న జీవనశైలి మార్పుల పట్ల శ్రద్ద పెట్టడం చాలా అవసరం. ఈ కారకాలలో హార్మోన్ల అసమతుల్యత, సక్రమంగా లేని పీరియడ్స్, శక్రకణాల పరిమాణం, నాణ్యత తగ్గడం సంతానోత్పత్తిలో సహాజ క్షీణత, క్రోమోజోమ్ అసాధారణతలు పెరిగే అవకాశం ఉంది. 32ఏళ్ల వయస్సు నుండి సంతానోత్పత్తి క్రమంగా తగ్గుతుంది. 37ఏళ్ల తర్వాత ఇది మరింత వేగంగా తగ్గుతుంది. ఒక వ్యక్తి గరిష్ట పునరుత్పత్తి..యుక్తవయస్సు చివరి నుండి 20ఏళ్ల చివరి వరకు ఉంటాయి. అయినా కూడా కొంతమంది కెరీర్, ఇతర సమస్యల కారణంగా 40ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకోసం ప్రయత్నిస్తున్నారు.

సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి చిట్కాలు ఇవే:

మంచి ఆహారం, మంచి పునరుత్పత్తి ఆరోగ్యం :

మీరు ఆరోగ్యంగా ఉంటే మీ సంతానోత్పత్తి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. శుద్ది చేసిన షుగర్, ప్రాసెస్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి గర్భం దాల్చడాన్ని మరింత కష్టంగా మార్చుతాయి. వీటికి బదులుగా విటమిన్లు, ఖనిజాలతో కూడిన తాజా ఆహారం తీసుకోవడం ముఖ్యం.

మీ పీరియడ్స్‌ను ట్రాక్ చేయండి :

మీకు పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడం ముఖ్యం. ఇది మీ సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుంది.రెగ్యులర్ పీరియడ్ సాధారణంగా స్థిరమైన అండోత్సర్గాన్ని సూచిస్తుంది. ఇది మీ సంతానోత్పత్తి ఆరోగ్యానికి సానుకూల సంకేతమని వైద్యులు చెబుతున్నారు.

ప్రోబయోటిక్:

మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు,మీ శరీరం మైక్రోబయోమ్ మంచి ఆకృతిలో ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.మైక్రోబయోమ్ పనిచేయకపోవడం ఆటో ఇమ్యూన్ వ్యాధులు, మానసిక అనారోగ్యాలు, సంతానోత్పత్తి సమస్యలతో సహా వివిధ సమస్యలకు దోహదం చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.అందుకే మీ ఆహారంలో ప్రోబయోటిక్ చేర్చుకోవడం ముఖ్యమని సలహా ఇస్తున్నారు.

ఫోన్ కు దూరంగా:

చాలా మందికి రాత్రిళ్లు ఫోన్ చూసే అలవాటు ఉంటుంది. ఇది మీ నిద్ర విధానానికి అంతరాయం కలిగిస్తుంది. అంతేకాదు సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. రాత్రి పడుకునేముందు ఫోన్ దూరంగా ఉంచడం చాలా అవసరం.

స్మార్ట్ ఫిట్‌నెస్ :

వారంలో ఎక్కువ రోజులు శారీరకంగా చురుకుగా ఉండటం వల్ల మీ సంతానోత్పత్తి సానుకూలంగా ఉంటుంది. అధిక వ్యాయామం, శ్రమతో కూడిన వ్యాయామాలు పునరుత్పత్తి విధులకు ఆటంకం కలిగిస్తాయి.

ఆరోగ్యకరమైన BMI :

మీ బరువు కూడా గర్భంపై ప్రభావం చూపుతుంది. సాధారణ బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ఉన్న వారితో పోలిస్తే అధిక బరువు ఉన్న మహిళలు గర్భం దాల్చడానికి రెండు రెట్లు ఎక్కువ సమయం పడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. తక్కువ బరువు ఉండటం వల్ల గర్భం దాల్చడానికి పట్టే సమయాన్ని రెట్టింపు చేయవచ్చు.

ఒత్తిడికి దూరంగా :

ముఖ్యంగా 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్న వారికి, అనేక బాధ్యతలతో బిజీ లైఫ్‌ని నిర్వహించడం చాలా భారంగా ఉంటుంది. మానసిక, శారీరక శ్రేయస్సు రెండింటికీ విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. ఒత్తిడిని తగ్గించడానికి ఇతర అన్వేషించడం అవసరం. ఒత్తిడికి దూరంగా తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరం. 

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Tags:    

Similar News