Painkiller Tablets: కాస్త నొప్పి అనగానే పెయిన్ కిల్లర్‌ వేసుకుంటున్నారా.? ఏమవుతుందో తెలిస్తే..

మరీ ముఖ్యంగా వైద్యులను సంప్రదించకుండా పెయిన్‌ కిల్లర్స్‌ని వాడడం వల్ల ఎన్నో సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు.

Update: 2024-09-25 06:00 GMT

Health: కాస్త నొప్పి అనగానే పెయిన్ కిల్లర్‌ వేసుకుంటున్నారా.? ఏమవుతుందో తెలిస్తే..

Painkiller Tablets: మనలో చాలా మంది కాస్త తలనొప్పి అనిపించగానే పెయిన్‌ కిల్లర్స్‌ వాడుతుంటారు. బాడీ పెయిన్స్‌కి కూడా ట్యాబ్లెట్స్‌ను వేసుకుంటారు. అయితే పెయిన్‌ కిలర్స్‌ని వాడడం వల్ల వెంటనే నొప్పి తగ్గిన భావన కలిగినా దీర్ఘకాలంలో మాత్రం తీవ్ర సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైద్యులను సంప్రదించకుండా పెయిన్‌ కిల్లర్స్‌ని వాడడం వల్ల ఎన్నో సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు. ఇంతకీ పెయిన్‌ కిల్లర్స్‌ వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* పెయిన్ కిల్లర్స్‌ వేసుకోగానే నొప్పి తగ్గిన భావన కలిగినా తర్వాత తలనొప్పి పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పెయిన్ కిల్లర్స్‌ను అతిగా వాడే వారిలో తరచూ తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

* కొన్ని రకాల పెయిన్‌ కిల్లర్స్‌ని ఎక్కువ రోజులు వాడడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కడుపులో చికాకు, అల్సర్, అంతర్గత రక్తస్రావం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

* ఇక ట్యాబ్లెట్స్‌ను ఎక్కువగా వేసుకోవడం వల్ల ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో కిడ్నీలు దెబ్బతినడం ఒకటి. పెయిన్‌ కిల్లర్స్‌ అధికంగా వాడే వారిలో మూత్రపిండాల వైఫ్యలం ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

* పెయిన్‌ కిల్లర్స్‌ను అధికంగా వాడడం వల్ల కాలేయంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎసిటమైనోఫెన్ ట్యాబ్లెట్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయ వైఫల్యానికి దారి తీస్తుంది.

పెయిల్ కిల్లర్స్‌ను వాడే సమయంలో కొన్ని పద్ధతులు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. పెయిన్‌ కిల్లర్స్‌ను తీసుకునే సమయంలో ఒక ట్యాబ్లెట్‌కి మరో ట్యాబ్లెట్‌కి మధ్య కనీసం 5 గంటలు ఉండేలా చూసుకోవాలి. అలాగే వారానికి 2-3 సార్లు కంటే ఎక్కువ తీసుకోకూడదు. నొప్పి చాలా కాలం పాటు కొనసాగితే లేదా తరచుగా సంభవిస్తే వైద్యుడిని సంప్రదించాలి.

మరీ ముఖ్యంగా వైద్యులను సంప్రదించకుండా పెయిన్‌ కిల్లర్స్‌ని వాడడం వల్ల ఎన్నో సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు. పైన తెలిపిన వివరాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Tags:    

Similar News