Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టాలా.? వీటిని కచ్చితంగా తీసుకోండి..!

Bad Cholesterol: తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, మారిన జీవన శైలి కారణంగా చెడు కొలెస్ట్రాల్ సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది.

Update: 2024-10-13 15:00 GMT

Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టాలా.? వీటిని కచ్చితంగా తీసుకోండి..!

Bad Cholesterol: తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, మారిన జీవన శైలి కారణంగా చెడు కొలెస్ట్రాల్ సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ సమస్య కారణంగా బరువు పెరగడంతో పాటు గుండె సంబంధిత సమస్యలు సైతం ఎక్కువ అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయే పరిస్థితికి సైతం దారి తీస్తుంది. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. వీటిలో తీసుకునే ఆహారం ప్రధానమని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే తీసుకునే ఆహారంలో కొన్ని రకాల పదార్థాలను భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే బచ్చలి కూరను క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు పచ్చని కూరలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ధమనుల్లో రక్తం గడ్డ కట్టే అవకాశాలను తగ్గిస్తాయి. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ ను కూడా కరిగించేస్తుంది. క్రమం తప్పకుండా బచ్చలి కూరను తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.

* శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తరిమికొట్టడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ముఖ్యంగా పడగడుపున ప్రతిరోజు ఒక వెల్లుల్లిని తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు పూర్తిగా దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

* చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో బ్రోకలీ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్ కంటెంట్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఇందులో పుష్కలంగా ఉండే ఫైటోన్యూట్రియెంట్స్, యాంటీఆక్సిడెంట్లు శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి. బ్రోకలీలో విటమిన్లు సి , ఎ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

* క్యారెట్ ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాలను పూర్తిగా తగ్గిస్తుంది, అలాగే గుండె సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.

* శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో బెండకాయ కూడా ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. క్రమం తప్పకుండా బెండకాయ తీసుకోవడం వల్ల గుండె ధమనుల్లో తలెత్తే సమస్యలు దూరమవుతాయి. అలాగే ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

నోట్ : పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Tags:    

Similar News