Uric Acid: యూరిక్ యాసిడ్ పెరిగితే చాలా డేంజర్.. ఈ ఫుడ్ కచ్చితంగా తీసుకోవాల్సిందే
Uric Acid: శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం సర్వసాధారణమైన విషయం. అయితే కిడ్నీలు యూరిక్ యాసిడ్‌ను ఫిల్టర్ చేసి మూత్రం రూపంలో శరీరం నుంచి తొలగిస్తుంది.
Uric Acid: శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం సర్వసాధారణమైన విషయం. అయితే కిడ్నీలు యూరిక్ యాసిడ్‌ను ఫిల్టర్ చేసి మూత్రం రూపంలో శరీరం నుంచి తొలగిస్తుంది. అయితే శరీరంలో యూరిక్ యాసిడ్ ఒక్కసారిగా పెరిగితే కిడ్నీలు కూడా ఫిల్టర్ చేయలేదు. దీంతో అది క్రమంగా కీళ్లలో పేరుకుపోతుంది. దీంతో తవ్రమైన కీళ్ల నొప్పులు వస్తాయి. ఇవి ఆర్థరైటిస్ లేదా ఇతర బాధాకరమైన సమస్యలకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జీవనశైలిలో వచ్చిన మార్పులు కారణమని నిపుణులు చెబుతున్నారు. తగినంత నీరు తాగని వ్యక్తుల్లో, రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తే, మీకు కూడా ఈ సమస్య వస్తుంది. అలాగే అధికంగా మాంసాహారం తీసుకోవడం, తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగుతాయని అంటున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే జీవన శైలిలో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే చెర్రీలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అంటున్నారు. రెగ్యులర్‌గా వీటిని తీసుకోవాలి.
* యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిడచంలో గ్రీన్ టీ కూడా క్రీయాశీలకంగా పని చేస్తుంది. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
* తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలను భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకుంటే.. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో శరీరంలో ఫిల్టరేషన్ సజావుగా సాగుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పేరుకోకుండా చేస్తుంది.
* యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగకుండా ఉండాలంటే కచ్చితంగా పుష్కలంగా నీటిని తీసుకోవాలి. ఇది మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. తగినంత మొత్తంలో నీరు తాగడం వల్ల మూత్రపిండాలు సక్రమంగా పనిచేయడంతోపాటు యూరిక్ యాసిడ్‌ను తొలగించవచ్చు.
* తీసుకునే ఆహారంలో తృణ ధాన్యాలను చేర్చుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ స్థాయిలు అదుపులోఉంటాయి. ఓట్స్, బార్లీ, బ్రౌన్ రైస్ వంటి వాటిని చేర్చుకుంటే, అది మీ శరీరం నుండి యూరిక్ యాసిడ్‌ను తొలగించడంలో ఉపయోగపడుతుంది.