Side Effects: పెరుగులో ఉల్లిపాయ కలిపి తింటున్నారా.. ఈ డేంజర్ గురించి తెలుసా?
Side Effects of Eating onion with curd mix: పెరుగులో ఉల్లిపాయ కలిపి తీసుకోవడం సర్వసాధారణమైన విషయం. చాలా మందికి ఈ అలవాటు ఉండే ఉంటుంది. ముఖ్యంగా నాన్-వెజ్ తిన్న తర్వాత పెరుగు, ఉల్లిపాయ కలిపి తినే అలవాటు చాలామందిలో కనిపిస్తుంటుంది. ఇంకెంత మంది ఏకంగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు మజ్జిగలో కలిపి లస్సీలా తాగేస్తుంటారు. అయితే ఇది కొందరికి అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయ, పెరుగు కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం ఉల్లిపాయ వేడి స్వభావం, పెరుగు చల్లటి స్వభావం కలిగి ఉండడమేనని పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ పెరుగు, ఉల్లిపాయ కలిపి తీసుకుంటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు, ఉల్లిపాయ కలిపి తీసుకోవడం వల్ల కొందరిలో చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో ఒక్కసారిగా వేడి పెరుగుతుంది. ఇది టాక్సిన్స్ స్థాయిలు పెరగడానికి కారణమవుతుంది. దీంతో చర్మంపై దద్దుర్లు, దురద వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా తామర, సోరియాసిస్ వంటి చర్మ సంబంధిత సమస్యలుతో బాధపడేవారు ఈ అలవాటుకు పూర్తిగా దూరంగా ఉండాలి అని సూచిస్తున్నారు.
* దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఉల్లిపాయలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. పెరుగులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు కలవడం వల్ల శరీరానికి అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ముఖ్యంగా అజీర్ణం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.
* ఉల్లిపాయలో వేడి స్వభావం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ రెండింటిని కలిపి తీసుకోవాలని అంటున్నారు.
* పెరుగు, ఉల్లిపాయను కలిపి తీసుకోవడం వల్ల హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అయ్యే ప్రమాదం ఉంటుందని వైద్యులు అంటున్నారు. దీనివల్ల శరీరంలో పలు అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ఇంటర్నెట్ వేదికగా లభించిన సమాచారం మేరకు అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.