Pressure Cooker: ఈ 5 ఫుడ్స్ ప్రెషర్ కుక్కర్‌లో పొరపాటున వండకూడదు..

Must Not Cook In Pressure Cooker: ప్రతిరోజు మనం కొన్ని ఆహారాలను ప్రెషర్ కుక్కర్‌లో వండాల్సి వస్తుంది. ఇందులో వడంటం వల్ల త్వరగా వంట పూర్తవుతుంది.. అయితే కొన్ని ఆహారాలు ప్రెషర్ కుక్కర్‌లో పొరపాటున కూడా వండకూడదు.

Update: 2025-03-26 07:57 GMT
Pressure Cooker

Pressure Cooker: ఈ 5 ఫుడ్స్ ప్రెషర్ కుక్కర్‌లో పొరపాటున వండకూడదు..

  • whatsapp icon

Must Not Cook In Pressure Cooker: ప్రెషర్ కుక్కర్‌లో వండకూడని కొన్ని ఆహారాలు ఉన్నాయి. వీటిని అందులో వండడం వల్ల వాటి పోషకాలను కోల్పోతాయి. రుచి కూడా అంత బాగుండదు. అయితే పొరపాటున కూడా ప్రెషర్ కుక్కర్‌లో వండకూడని కొన్ని ఆహారాలు ఉన్నాయి.. అవి ఏంటో తెలుసుకుందాం

ఆకుకూరలు..

ఆకుకూరలు పొరపాటున కూడా ప్రెషర్ కుక్కర్‌లో వండకూడదు. అంటే ప్రధానంగా పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో ఖనిజాల పుష్కలంగా ఉంటాయి, ఇవి ప్రెషర్ కుక్కర్‌లో వండటం వల్ల ఇందులో ఉండే పోషకాలు కోల్పోతాం. రుచి కూడా బాగుండదు ఎక్కువ ప్రెషర్‌పై కుక్ అవుతాయి కాబట్టి వీటి కలర్ కూడా కోల్పోతాయి. వీటిని ఒక కడాయి లేదా గిన్నెలో వేయించుకొని తీసుకోవాలి. ప్రెషర్ కుక్ చేయడం వల్ల పోషకాలు అందవు టేస్ట్ కూడా మారిపోతుంది.

పాలు పాల పదార్థాలు..

పాలు, క్రీమ్ ఇతర పాల పదార్థాలు కూడా ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించటం వల్ల అవి తమ రుచిని కోల్పోతాయి. అంతేకాదు త్వరగా పాడై పోతాయి. ఆ కుక్కర్‌ శుభ్రం చేయడానికి కూడా చాలా సమయం పడుతుంది. క్రీమ్ అధికంగా ఉండే పాల పదార్థాలు కూడా ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించకూడదు.

పాస్తా..

పాస్తాను ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించకూడదు. ఇప్పటికే మెత్తగా ఉంటుంది ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించటం వల్ల అతిగా కుక్ అయిపోయి దాని టెక్స్చర్ మారిపోతుంది, రుచి కూడా బాగుండదు.

గుడ్లు..

చాలామంది గుడ్లను ప్రెషర్ కుక్కర్‌లో ఉడికిస్తారు అయితే ఇలా చేయటం వల్ల హై ప్రెజర్‌లో గుడ్లు ఉడికిపోయి. వాటి షెల్స్‌ కూడా త్వరగా పగిలిపోతాయి. తొక్క తీయడం కూడా చాలా కష్టంగా మారుతుంది. గుడ్లను సరిగ్గా ఉడికించాలంటే కేవలం గిన్నెలో మాత్రమే ఉడికించండి.

ఫ్రై..

ఇవి కాకుండా కొన్ని ఫ్రై చేసే ఆహారాలు కూడా ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించకూడదు. ఫ్రై చేసే ఆహారాలు కేవలం ఫ్రై పాన్ మాత్రమే ఉపయోగించండి. ప్రెషర్ కుక్కర్‌లో ఉపయోగించడం వల్ల సరిగ్గా ఉడకదు. రుచి కూడా కోల్పోతాం, పోషకాలు కూడా లభించవు

సముద్రపు ఆహారాలు..

కొన్ని సముద్రపు ఆహారాలు కూడా ప్రెజర్ కుక్కర్‌లో వండకూడదు. చేపలు, రొయ్యలు, ప్రెజర్ కుక్కర్‌లో ఉడికించటం వల్ల ఇందులో ఉండే పోషకాలు కోల్పోతాము, రుచి కూడా బాగుండదు. అంతేకాదు కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాసన కూడా బాగుండదు. ఇక ప్రెషర్ కుక్కర్ లో బంగాళదుంప కూడా ఉడికించకూడదు. గంజి పదార్థాలకు సంబంధించిన ఏ ఫుడ్స్‌ కుక్కర్‌లో ఉడికించక పోవడమే మంచిది.

అన్నం..

ప్రధానంగా అన్నం కూడా ప్రెషర్ కుక్కర్‌లో వండకూడదు. అతిగా ఉడికించడం వల్ల త్వరగా అన్నం ఉడుకుతుంది. కానీ కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. హై ప్రెజర్ లో రైస్ త్వరగా ఉడికిపోతుంది కానీ తర్వాత కడుపు గ్యాస్‌, అజీర్తి సమస్యలకు కూడా దారితీస్తుంది.

Tags:    

Similar News