Eggs: గుడ్లు తినలేరా? అయితే శరీరంలోని ప్రోటీన్ లోపాన్ని ఇలా భర్తీ చేసుకోండి..
Protein Rich Foods: గుడ్లలో విటమిన్ డి ఉంటుంది. ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీర ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం.

Eggs: గుడ్లు తినలేరా? అయితే శరీరంలోని ప్రోటీన్ లోపాన్ని ఇలా భర్తీ చేసుకోండి..
Protein Rich Foods: గుడ్లలో ప్రోటీన్ పుష్కలం. మన శరీరంలో ప్రోటీన్ లేమిని భర్తీ చేస్తుంది. అయితే గుడ్లు తినలేని వారు చాలామంది ఉన్నారు. వాళ్లకు ప్రోటీన్ లోపం ఎలా భర్తీ చేయాలో తెలుసుకుందాం.
ప్రతిరోజు ఒక గుడ్డు తినాలని డాక్టర్ చెబుతారు. అయితే చాలామంది గుడ్లు తినని వారు కూడా ఉన్నారు. వీళ్ళకి ప్రోటీన్ సరిగా అందదు. ఈ నేపథ్యంలో ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారాలకు మళ్లాలి ప్రోటీన్ లేమిని ఎలా అధిగమించాలో తెలుసుకుందాం.
తృణధాన్యాలు..
గుడ్లు తినని వారు తృణ ధాన్యాలు, పప్పులు ప్రధానంగా తీసుకోవాలి. ఇందులో ప్రోటీన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. బీన్స్, శనగలు వంటివి డైట్లో చేర్చుకోవడం వల్ల ప్రోటీన్లు లేమిని అధిగమించవచ్చు. ఈ పప్పులతో పప్పు లేదా సాంబార్ వంటివి తయారు చేసుకోవచ్చు.
తోపు..
గుడ్లు తినని వారు తోపు తినాలి. ఇందులో మొక్కల ఆధారిత ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కూడా ఇందులో ఉంటుంది. ఇది ఆరోగ్య ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది .
గ్రీక్ యోగార్ట్..
గుడ్లకు బదులు గ్రీక్ యోగార్ట్ తీసుకోవాలి. ఇందులో ప్రోటీన్ అధిక మోతాదులో ఉంటుంది. దీంతో శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యకరమైన పేగు కదలికలకు కూడా గ్రీకు యోగర్ట్ తోడ్పడుతుంది.
పుట్టగొడుగులు..
గుడ్లు తినలేని వారు పుట్టగొడుగులు కూడా సులభంగా తినవచ్చు. ఇందులో ప్రోటీన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. పుట్టగొడుగులు రుచికరంగా ఉంటాయి. దీంతో రకరకాల రిసిపీలు తయారు చేసుకోవచ్చు. గుడ్లలో ఉండే అంత ప్రోటీన్ పుట్టగొడుగుల్లో కూడా ఉంటుంది.
ఆవకాడో..
ఇది మాత్రమే కాదు గుడ్లు తినని వెజిటేరియన్స్ ఆవకాడో తినవచ్చు. ఈ బట్టర్ ఫ్రూట్ లో అధికంగా ప్రోటీన్ ఉంటుంది. ఇది అందానికి మా ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా తోడ్పడుతుంది. అవకాడోని నేరుగా తేనె వేసుకుని తీసుకోవచ్చు. లేదా దీన్ని సలాడ్, స్మూథీ రూపంలో కూడా తీసుకుంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి.