Vitamin B12: విటమిన్ బి12 లేమితో బాధపడుతున్నవారు ఈ 5 విత్తనాలతో సరిచేసుకోండి..!
Vitamin B12 Rich Nuts: విటమిన్ బి12 విటమిన్ మీ శరీరంలో లోపిస్తే రక్తహీనత తీవ్రంగా అలసట, తలతిరుగుడు వంటి సమస్యలు వస్తాయి.

Vitamin B12 Rich Nuts: విటమిన్ బి12 విటమిన్ మీ శరీరంలో లోపిస్తే రక్తహీనత తీవ్రంగా అలసట, తలతిరుగుడు వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు యాంగ్జైటీకి కూడా గురవుతారు. అందుకే కొన్ని రకాల ఫుడ్స్ డైట్ లో చేర్చుకుంటే విటమిన్ బి 12తో బాధపడుతున్న వారికి మంచి రెమెడీ. ప్రధానంగా గుడ్లు, మాంసం, పాలు వంటివి డైట్లో చేర్చుకోవాలి. అయితే శాకాహారులు కొన్ని రకాల గింజలు డైట్లో చేర్చుకుంటే ఈ విటమిన్ తో లేమిని సరిచేసుకోవచ్చు.
చియా విత్తనాలు ..
విటమిన్ b12తో బాధపడుతున్న వారు చియా విత్తనాలు డైట్లో చేర్చుకోవాలి. ఇందులో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఐరన్, ఫోలేట్ కూడా ఇది రక్తం ఉత్పత్తిని కూడా పెంచుతుంది. తద్వారా రక్తహీనత నుంచి బయటపడతారు.
పొద్దుతిరుగుడు విత్తనాలు..
విటమిన్ బి12తో బాధపడుతున్న వారు పొద్దుతిరుగుడు విత్తనాలు కూడా తమ డైట్లో చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో విటమిన్ b6, ఫోలెట్, ఐరన్ ఉంటుంది. మెగ్నీషియం ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. రక్తం ఉత్పత్తి అయ్యేలా ప్రేరేపిస్తుంది. వీటిని స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు.
నువ్వులు..
రెగ్యులర్‌గా నువ్వులను డైతో చేర్చుకోవడం వల్ల ఇనుము అందుతుంది. అంతేకాదు ఇందులో కాల్షియం కూడా ఉంటుంది. ఎముకలు కూడా బలంగా మారుతాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని కూడా పెంచుతుంది. వీటిని ఆహారంలో తీసుకోవచ్చు. లడ్డూల రూపంలో కూడా తయారు చేసుకుని వినియోగించవచ్చు.
గుమ్మడి గింజలు..
గుమ్మడి గింజలు కూడా విటమిన్ బి 12 ని భర్తీ చేస్తాయి. ప్రధానంగా ఇందులో జింక్, మెగ్నీషియం ఉంటుంది. దీన్ని కూడా స్నాక్‌లా తీసుకోవచ్చు లేదా ఏదైనా కూరలో వేసి వాడొచ్చు.
అవిసె గింజలు ..
విటమిన్ బీ12 వల్ల లేమితో బాధపడుతున్న వారు అవిసె గింజలు డైట్లో చేర్చుకోవాలి. ఇందులో ఒమేగా ౩ ఫ్యాటీ యాసీడ్స్ ఉంటాయి, ఫైబర్ కూడా ఉంటుంది. ప్రధానంగా వీటిని గ్రైండ్ చేసి కూరల్లో వేసుకొని తీసుకోవచ్చు.