Malaria: జ్వరం వస్తే మలేరియానా? నిర్ధారణ కోసం ఏ టెస్ట్ చేయాలి?
Malaria: వాతావరణం వేడెక్కుతున్న కొద్దీ మలేరియా భయం కూడా పెరుగుతోంది. ఆడ ఎనాఫిలిస్ దోమ కుట్టడం వల్ల మలేరియా వ్యాపిస్తుంది.

Malaria : జ్వరం వస్తే మలేరియానా? నిర్ధారణ కోసం ఏ టెస్ట్ చేయాలి?
Malaria: వాతావరణం వేడెక్కుతున్న కొద్దీ మలేరియా భయం కూడా పెరుగుతోంది. ఆడ ఎనాఫిలిస్ దోమ కుట్టడం వల్ల మలేరియా వ్యాపిస్తుంది. ఈ వ్యాధిలో రోగికి చలితో కూడిన తీవ్రమైన జ్వరం వస్తుంది. చెమటలు పట్టాక జ్వరం తగ్గినట్లు అనిపించినా మళ్లీ మొదలవుతుంది. మలేరియాకు సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకం కూడా కావచ్చు.
వేసవిలో కురిసే వర్షాలు మలేరియా వ్యాప్తికి అనుకూలమైన వాతావరణాన్ని కలిగిస్తాయి. ఈ రోజుల్లో ప్రతిచోటా దోమల బెడద ఎక్కువైంది. దీని కారణంగా మలేరియా వచ్చే ప్రమాదం కూడా వేగంగా పెరుగుతోంది. మలేరియా ప్రారంభ లక్షణాలను గుర్తించి వెంటనే చికిత్స ప్రారంభించాలి. మలేరియా తీవ్రమైతే ప్రాణాంతకం కావచ్చు. కొన్నిసార్లు మలేరియా జ్వరం మెదడుకు కూడా చేరుకుంటుంది. మలేరియా ప్రారంభ లక్షణాలలో చలి, తీవ్రమైన జ్వరం, వాంతులు, మైకము, తలనొప్పి వంటి సమస్యలు ఉంటాయి. మలేరియా జ్వరం ముదిరితే బ్రెయిన్ హెమరేజ్ కూడా సంభవించవచ్చు.
మలేరియాను గుర్తించడానికి ప్రధానంగా రెండు రకాల పరీక్షలు చేస్తారు. అవి మైక్రోస్కోపీ, రాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్. మైక్రోస్కోపీ పరీక్షలో రక్తం నమూనాను తీసుకొని ల్యాబ్‌లో పరిశీలిస్తారు. రాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా చేస్తారు. దీని ఫలితం వెంటనే తెలుస్తుంది. రాపిడ్ టెస్ట్‌లో మలేరియా పరాన్నజీవుల యాంటిజెన్‌లను గుర్తిస్తారు. అయితే రాపిడ్ టెస్ట్ ప్రాథమిక పరీక్ష మాత్రమే. ఈ పరీక్షతో మలేరియా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మైక్రోస్కోపీ పరీక్షతో మలేరియాను నిర్ధారిస్తారు. వీటితో పాటు మలేరియాను గుర్తించడానికి పీసీఆర్ టెస్ట్ కూడా చేస్తారు. అయితే దీని ఫలితాలు రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. వీటితో పాటు డాక్టర్లు మలేరియా నిర్ధారణ కోసం సీబీసీ, ఎల్‌ఎఫ్‌టీ వంటి ఇతర రక్త పరీక్షలను కూడా సూచించవచ్చు.
మలేరియా ప్రాణాంతకం కావచ్చు. కాబట్టి దీని నుండి రక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటిలో, పరిసరాల్లో దోమలు పెరగకుండా చూడాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. ఇంట్లో దోమల నివారణ కీటకనాశనులు, కాయిల్స్ ఉపయోగించాలి. దోమతెరలు వాడాలి. పిల్లల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. పిల్లలకు పొడవాటి చేతుల చొక్కాలు వేయాలి.