Health: పెరుగులో ఇవి కలుపుకొని తింటే.. కీళ్ల నొప్పులు బలదూర్ అవ్వాల్సిందే
Health Benefits: పెరుగు ఆరెోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్, కాల్షియం, విటమిన్ బి వంటివి జీర్ణక్రియ మెరుగుపర్చడంలో, ఎముకల బలాన్ని పెంచడంలో సహాయపడతాయి.

Health: పెరుగులో ఇవి కలుపుకొని తింటే.. కీళ్ల నొప్పులు బలదూర్ అవ్వాల్సిందే
Health Benefits: పెరుగు ఆరెోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్, కాల్షియం, విటమిన్ బి వంటివి జీర్ణక్రియ మెరుగుపర్చడంలో, ఎముకల బలాన్ని పెంచడంలో సహాయపడతాయి. అయితే, కొన్ని ప్రత్యేక విత్తనాలను పెరుగుతో కలిపి తీసుకుంటే, కీళ్ల నొప్పులు, వాపుల వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ గింజలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* అవిసె గింజలు, పెరుగు
అవిసె విత్తనాలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పెరుగుతో కలిపి తీసుకుంటే, కీళ్ల వాపు, గట్టిదనం తగ్గించడంలో సహాయపడతాయి. ప్రత్యేకించి ఆర్థరైటిస్ బాధితులకు ఇది ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకునేందుకు, ఒక టీ స్పూన్ కాల్చిన అవిసె గింజలను పెరుగులో కలిపి ఉదయం లేదా సాయంత్రం తినాలి.
* చియా విత్తనాలు, పెరుగు
చియా విత్తనాలు ఒమేగా-3, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లతో నిండిపోయి ఉంటాయి. వీటిని పెరుగుతో కలిపి తినడం వలన ఎముకలు బలపడతాయి, కీళ్ల చలనం మెరుగవుతుంది. దీనికోసం, ఒక టీ స్పూన్ చియా విత్తనాలను 20 నిమిషాలు నీటిలో నానబెట్టి, ఆ తరువాత పెరుగులో కలిపి తీసుకోవాలి.
* నువ్వులు, పెరుగు
నువ్వులు కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని పెరుగుతో కలిపి తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి, ఎముకల దృఢత్వం పెరుగుతుంది.
ఎప్పుడు తీసుకోవాలి.?
ఈ విత్తనాలను పెరుగుతో కలిపి అల్పాహారం లేదా రాత్రి భోజనం తర్వాత రోజుకు ఒకసారి తీసుకోవచ్చు. రుచిని పెంచేందుకు తేనెను కూడా చేర్చవచ్చు.
నోట్: ఈ వివరాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.