Bald Head: మీ బట్టతలపై జుట్టు తిరిగి మొలిపించే అసాధారణ చిట్కా..!

Bald Head Control Tips: జుట్టు ఊడిపోయి బట్టతల వచ్చే సమస్య ఎక్కువగా అవుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కువమంది హెయిర్ ఫాల్ బారిన పడుతున్నారు.

Update: 2025-04-24 10:37 GMT
Regrow Hair on Bald Head Naturally Best Tips to Stop Hair Fall Fast

Bald Head: మీ బట్టతలపై జుట్టు తిరిగి మొలిపించే అసాధారణ చిట్కా..!

  • whatsapp icon

Bald Head Control Tips: హెయిర్ ఫాల్ విపరీతంగా పెరిగినప్పుడు రాను రాను బట్టతల కూడా వస్తుంది. ఇది ఫ్యామిలీ హిస్టరీ వల్ల కావచ్చు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కారణము అవుతాయి. అయితే మామూలుగా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటే జుట్టు రాలడం వల్ల బట్టల సమస్య కూడా వస్తుంది. బట్టతలపై జుట్టు మొలిపించే కొన్ని చిట్కాలు ఉన్నాయి.

హెయిర్ ఫాల్ సమస్య రాకుండా ముందుగానే సరైన లైఫ్ స్టైల్ పాటించడం ఎంతో ముఖ్యం. అయితే హెయిర్ ఫాల్ సమస్య వచ్చినప్పుడే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా మీ కుదుళ్ల ఆరోగ్యం బాగుండాలి. తలను ఎప్పుటికప్పుడు మసాజ్ చేసుకుంటూ ఉండాలి. దీంతో రక్త ప్రసరణ మెరుగవుతుంది జుట్టు పెరుగుతుంది.

బట్టతలపై కూడా జుట్టు పెరగాలంటే సల్ఫేట్ లేని షాంపూ ,కండిషనర్ ఉపయోగించండి. దీంతో మీ జుట్టు రాలకుండా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆ జుట్టుకు ఆయిల్ తో మసాజ్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల రాలిన జుట్టు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా బయోటీన్‌ ఉండే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వండి. దీంతో మీ జుట్టు కుదుళ్ళ నుంచి బలంగా మారి ఆరోగ్యంగా పెరుగుతుంది.

రెగ్యులర్‌గా ఆముదం నూనె బట్టతలకు రాయడం వల్ల తలలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. మళ్ళీ జుట్టు పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు హైడ్రేషన్ గా ఉండాలి. అంతేకాదు ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఉల్లిపాయ రసం, కలబంద ఉపయోగించడం వల్ల కూడా బట్ట తలపై కూడా జుట్టు పెరిగే అవకాశం ఉంది.

Tags:    

Similar News