Green Chutney: ఈ ఆకు కూర యూరిక్ యాసిడ్ కిల్లర్.. శరీరంలో విష పదార్థాలు పరార్..!
Green Chutney For Uric Acid: యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్ అధికంగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల వస్తుంది. దీని వల్ల కీళ్ల నొప్పుల సమస్యలు వస్తాయి.

Green Chutney: ఈ ఆకు కూర యూరిక్ యాసిడ్ కిల్లర్.. శరీరంలో విష పదార్థాలు పరార్..!
Green Chutney For Uric Acid: యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్న వారికి కీళ్లనొప్పులతో పాటు కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. అయితే సరైన లైఫ్ స్టైల్ పాటించకపోవడం వల్ల యూరిక్ యాసిడ్ పెరగడానికి ప్రధాన కారణం. ప్రధానంగా ప్యూరిన్ తక్కువగా ఉండే ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి. అయితే యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని ఫుడ్స్ డైట్‌లో చేర్చుకుంటే విష పదార్థాలను బయటికి పంపించేస్తుంది. కిడ్నీలో రాళ్లు సైతం బయటకి వెళ్ళిపోతాయి.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కొత్తిమీరను డైట్ లో చేర్చుకోవాలి. సాధారణంగా మన వంటల్లో కొత్తిమీర ఉపయోగిస్తాం. ఇందులో విటమిన్ ఏ, సీ, భాస్వరం, ఐరన్, కాల్షియం ఉంటుంది. మన శరీరంలో నుంచి విష పదార్థాలను బయటికి పంపించడానికి కొత్తిమీర పని చేస్తుంది.
అంతేకాదు ఇందులో ప్యూరిన్ తక్కువగా ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు యూరిక్ యాసిడ్‌ను కూడా సమర్థవంతంగా తగ్గించేస్తాయి. అయితే కొత్తిమీరతో చట్నీ చేసుకొని తీసుకుంటే కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. మన శరీరంలో పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ మూలాల నుంచి తొలగిపోతుంది.
కొత్తిమీర, పుదీనా ఆకులు, అల్లం, నిమ్మరసం మీ రుచికి సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి వేసుకొని మిక్సీలో వేసి తయారు చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని అన్నం లేదా ఇతర పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల రాను రాను మీ శరీరంలో ఉన్న విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. ఇది ఇంట్లో తయారు చేసుకోగలిగే సహజమైన తక్కువ బడ్జెట్ లోని రెమిడీ.
శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిపోతే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. అంతేకాదు కీళ్ల నొప్పుల సమస్య మరింత ఎక్కువవుతుంది. ప్రమాదం బారిన పడకుండా ఉండాలంటే ముందుగానే ప్యూరీన్ తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడంతో పాటు ఎక్కువ శాతం నీళ్లు తీసుకోవాలి. ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ తగ్గుతుంది.