White Heads: వైట్ హెడ్స్ తగ్గాలంటే పార్లర్ వెళ్లాల్సిన పనిలేదు.. ఇంట్లోనే ఈ 5 టిప్స్ ట్రై చేయండి
White Heads Control Remedy: ముఖంపై మచ్చలు, గీతలు ఒక సమస్య అయితే రంధ్రాలు డెడ్ సెల్ స్కిన్ వల్ల ముఖం అందవిహీనంగా మారిపోతుంది.

White Heads: వైట్ హెడ్స్ తగ్గాలంటే పార్లర్ వెళ్లాల్సిన పనిలేదు.. ఇంట్లోనే ఈ 5 టిప్స్ ట్రై చేయండి
White Heads Control Remedy: ముఖంపై మచ్చలు, గీతలు ఒక సమస్య అయితే రంధ్రాలు డెడ్ సెల్ స్కిన్ వల్ల ముఖం అందవిహీనంగా మారిపోతుంది.
అప్పుడప్పుడు ముఖంపై కనిపించే వైట్ హెడ్స్ వల్ల మీ ముఖమంతా అందవిహీనంగా మారిపోతుంది. ఈ ప్రధానంగా ముక్కు, నోరు ప్రాంతంలో ఇవి కనిపిస్తాయి. అయితే డెడ్ స్కిన్ సెల్స్ వల్ల ఇలా జరుగుతుంది. అయితే వైట్ హెడ్స్ వదిలించుకోవడానికి కొన్ని చిట్కాలు ట్రై చేయండి.
వైట్ హెడ్స్ తో బాధపడుతున్న వారు ముఖాన్ని ఎప్పటికప్పుడు క్లెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ముఖంపై ఎక్కువ వేడి నీళ్లు ఉపయోగించకూడదు. టీ ట్రీ ఆయిల్ తో తయారు చేసిన క్లెన్సర్ ఉపయోగిస్తే బాగుంటుంది.
అప్పుడప్పుడు ముఖాన్ని స్టీమ్ చేసుకోవాలి. తద్వారా డెడ్ సెల్స్ అదనపు నూనె బయటకు వచ్చేస్తుంది. కాటన్ తో తుడుచుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల వైట్ హెడ్ సమస్య తగ్గిపోతుంది.
మీరు ఉపయోగిస్తున్న దిండు కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. బ్యాక్టీరియా పెరిగిపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. మనం తీసుకునే ఫుడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే అవిసె గింజలు, ఆకుకూరలు, చేపలు వంటివి తినాలి.
డెడ్ సెల్ స్కిన్ తొలగించడానికి ఎక్స్‌ఫోలియేషన్ కూడా మంచిది. వారానికి రెండుసార్ల మీరు తేనే, ఓట్ మిల్, నిమ్మరసం కలిపి తయారు చేసుకోవాలి. దీంతో ముఖాన్ని మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
ఇది మాత్రమే కాదు కొన్ని రకాల క్లే మాస్కులు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కొన్ని చుక్కల ట్రీ ఆయిల్ లో క్లే మాస్కు, యాపిల్ సైడర్ వెనిగర్ లేదా రోజ్ వాటర్ వేసి అప్లై చేసుకోవాలి. ముఖానికి కలబంద కూడా అప్లై చేయడం వల్ల వైడ్ హెడ్ సమస్య శాశ్వతంగా తగ్గిపోతుంది. వైట్ హెడ్స్ ఎక్కువగా వస్తున్నాయంటే ముఖంపై తేమ తగ్గిపోతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు మాయిశ్చరైజర్ ముఖానికి రాసుకోవడం అలవాటు చేసుకోవాలి.