Sri Ramanavami 2025: శ్రీరామనవమి ఎప్పుడు? సీతారాముల పూజకు శుభసమయం ఎప్పుడంటే?

Sri Ramanavami 2025 Auspicious Time: శ్రీరామనవమి భక్తిశ్రద్ధలతో హిందువులు అత్యంత వైభవంగా చేసుకునే పండుగ. ఈరోజు ప్రధానంగా సీతారాముల కళ్యాణం చేస్తారు.

Update: 2025-04-03 07:31 GMT
When is Sri Ramanavami 2025 and Auspicious Time for Puja

Sri Ramanavami 2025: శ్రీరామనవమి ఎప్పుడు? సీతారాముల పూజకు శుభసమయం ఎప్పుడంటే?

  • whatsapp icon

Sri Ramanavami 2025 Auspicious Time: ఈ ఏడాది శ్రీరామనవమి 2025 ఏప్రిల్‌లోనే రానుంది. ఈరోజు అన్ని ప్రధాన ఆలయాల్లో కూడా సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. హిందువులు అత్యంత వైభవంగా చేసుకునే పండుగ ఇది. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసే శ్రీరామనవమి తేదీ ఎప్పుడు? పూజా విధానం మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

శ్రీరాముడు అయోధ్యను పాలించాడు. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో ఈ మహా పురుషుడు జననం జరిగింది. సత్యం, ధర్మం ఎప్పటికీ విడువకుండా ధర్మ మార్గంలోనే నడిచాడు, ప్రజలను కూడా తనతో పాటు నడిపించి ఎంతో మందికి స్ఫూర్తిని అందించాడు. శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం చూసిన ఫలం లభిస్తుంది. ఈ రోజున ఉపవాసం ఉండి సీతారాముల పూజలు చేస్తే మరింత ఫలితాలు లభిస్తాయి. పెళ్లి కాని వారికి కూడా త్వరలోనే పెళ్లి యోగం కూడా కలుగుతుంది.

శ్రీరామనవమి ఈరోజు సాక్షాత్తు శ్రీరాముడి పుట్టినరోజు. ఆ రోజు సీతారాముల కళ్యాణం కూడా చేస్తారు. శ్రీరాముడు పుణ్యపురుషుడు పురాణాల్లో అత్యంత తేజస్సు కలిగిన మహానుభావుడు. ఏక ప్రతివ్రతుడు అంతే కాదు మహారాజు దశరథ కౌసల్య పుత్రుడు.

అయితే ప్రతి ఏడాది చైత్రమాసం నవమి రోజున శ్రీరామ వేడుక నవమి ఉత్సవాలు జరుపుతారు. ఈ ఏడాది శ్రీరామనవమి 2025 ఏప్రిల్ 6వ తేదీ అంటే ఆదివారం రోజున వస్తుంది. ఆ రోజు ప్రత్యేకంగా శ్రీరాముని వివాహానికి హాజరవుతారు. అంతేకాదు ఉపవాసాలు కూడా పాటిస్తారు.

ఇక శ్రీరామ నవమి రోజున శ్రీరాముని సీతమ్మల పూజకు ఉదయం బ్రహ్మ ముహూర్తం లో 4: 30 గంటల నుంచి 5:20 గంటల వరకు అద్భుతంగా ఉంటుంది. ఇది కాకుండా ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:20, సాయంత్రం 6:40 నిమిషాల నుంచి 7:30 గంటల వరకు బాగుంటుంది ఈ సమయంలో సీతారములవారి పూజ చేసుకోవచ్చు.

Tags:    

Similar News