Tongue Clean: నెల రోజులపాటు నాలుక శుభ్రం చేయకపోతే మీ శరీరానికి ఏం జరుగుతుందో తెలుసా?

Tongue Clean Side Effects: ఉదయం లేవగానే పళ్ళు తోముకోవడం, నాలుక శుభ్రం చేసుకోవడం మన ప్రధాన విధి. అయితే కొన్ని రోజులపాటు నాలుక శుభ్రం చేసుకోకపోతే మీ శరీరంలో ఎలాంటి ప్రభావం చెందుతుందో తెలుసా?

Update: 2025-04-23 09:35 GMT
Tongue Clean: నెల రోజులపాటు నాలుక శుభ్రం చేయకపోతే మీ శరీరానికి ఏం జరుగుతుందో తెలుసా?
  • whatsapp icon

Tongue Clean Side Effects: ఉదయం లేవగానే పళ్ళు తోముకోవడం, నాలుక శుభ్రం చేసుకోవడం మన ప్రధాన విధి. అయితే కొన్ని రోజులపాటు నాలుక శుభ్రం చేసుకోకపోతే మీ శరీరంలో ఎలాంటి ప్రభావం చెందుతుందో తెలుసా?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతిరోజు మీ నాలుకొని శుభ్రం చేసుకోవాలి. తద్వారా నీ నోట్లో ఉండే బ్యాక్టీరియా ఇతర ఆహారాల ఆహార శిథిలాలు, డెడ్ సెల్స్ వంటివి తొలగిపోతాయి. అయితే నాలుకను శుభ్రం చేసుకోకపోవడం వల్ల మన శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రధానంగా మీ నాలుకను తరచూ శుభ్రం చేసుకోవడం వలన మీ నోటి రుచి కూడా మెరుగవుతుంది. ఇది కాకుండా మీ నోట్లో ఉండే హానికర బ్యాక్టీరియా తొలగిపోతుంది. దుర్వాసన కూడా తగ్గిపోతుంది. జీర్ణ క్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

నాలుక శుభ్రం చేయడం వల్ల మీ ఇతర శరీర భాగాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. 30 రోజులకు పైగా మీ నాలుకను శుభ్రం చేయకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

30 రోజులపాటు మీరు నాలుక శుభ్రం చేయకపోతే నోట్లో నుంచి తీవ్రంగా దుర్వాసన వస్తుంది. అంతే కాదు నాలుక పై తెల్లటి మచ్చలు కూడా పెరిగి ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. దీంతో పాటు మీరు రుచి మొగ్గలు కూడా మూసుకుపోతాయి. డెడ్ సెల్స్ పేరుకుపోవడం వల్ల నాలుక కాస్త నల్లగా మారిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాక్టిరియా అంతా చిగుళ్ళకు వ్యాపిస్తుంది. దీంతో మీ చిగుళ్ల నుంచి రక్తం ఇతర సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది.

ఇది యాసిడ్ రీఫ్లక్స్‌ కూడా దారితీస్తుంది. అపరిశుభ్రంగా నాలుక ఉండటం వల్ల దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లతో పాటు చిగుళ్ల వ్యాధి సంభవిస్తుంది. ఇది కాలక్రమేణా పేగులకు కూడా ప్రవేశిస్తుంది. ఇలా క్రిములు మీ శరీరంలో ఉండి సంతానోత్పత్తి కూడా పెంచుతాయి. ఇలా మీ ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతాయి., నాలుకను తప్పకుండా ప్రతిరోజు శుభ్రం చేసుకోండి. ప్రధానంగా ధూమపానం చేసే వ్యక్తులు ఇంకా ఎక్కువ పరిశుభ్రత పాటించాలి.

Tags:    

Similar News