Diabetes: మండు వేసవిలో డయాబెటిస్ రోగులు గ్లూకోజ్ లెవెల్స్ ఎలా కంట్రోల్ లో ఉంచుకోవాలి?
Diabetes Care In Summer: ఎండ వేడిమి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో అందరూ డిహైడ్రేషన్‌కు గురి కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకంగా డయాబెటిస్ వారు అవలంబించాల్సిన విషయాలు తెలుసుకుందాం.

Diabetes: మండు వేసవిలో డయాబెటిస్ రోగులు గ్లూకోజ్ లెవెల్స్ ఎలా కంట్రోల్ లో ఉంచుకోవాలి?
Diabetes Care In Summer: ఎండ వేడిమి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో అందరూ డిహైడ్రేషన్‌కు గురి కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకంగా డయాబెటిస్ వారు అవలంబించాల్సిన విషయాలు తెలుసుకుందాం ..
మండే ఎండలో మాత్రమే కాదు ఏ సీజన్లో అయినా డయాబెటిస్ పేషెంట్స్ కాస్త జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం పై జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఎండాకాలం గ్లూకోజ్ స్థాయిలో అదుపులో ఉంచుకోవడానికి డయాబెటిస్ వారు మాత్రం కొన్ని టిప్స్ పాటించాలి. తద్వారా వీళ్ళు డిహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో తప్పకుండా ఉంటాయి.
డయాబెటిస్ బారిన పడినవారు వేసవికాలంలో కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలి. తద్వారా గాలి కూడా ఆగుతుంది అంటే కాదు బిగుతుగా ఉండే దుస్తులు ధరించకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు మీరు ఎప్పటికప్పుడు నీటిని కూడా సరైన మోతాదులో తీసుకోవాలి. తద్వారా డిహైడ్రేషన్ కి గురికాకుండా ఉంటారు. ఎక్కువ శాతం పండ్ల రసం తీసుకోరు కాబట్టి నీళ్లు అధికంగా తీసుకోవాలి.
డయాబెటిస్ ఫ్రెండ్లీ అయిన డ్రింక్స్ కూడా తీసుకోవడం మంచిది. తద్వారా గ్లూకోజ్ అదుపులో ఉంటాయి. అంతేకాదు డిహైడ్రేషన్ గురికాకుండా ఉంటారు. డయాబెటిస్ వారికి ప్రత్యేకంగా కొన్ని ఎలక్ట్రోలైట్ జ్యూసులు కూడా అందుబాటులో ఉంటాయి. వాటిని తీసుకోవడం మంచిది. వీటి కోసం వైద్యులను సంప్రదించాలి.
అంతేకాదు డయాబెటిస్ వారు నిత్యం రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉండాలంటే వ్యాయామం చేస్తూ ఉండాలి. క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి. ప్రధానంగా పండ్లు, కూరగాయలు డైట్లో చేర్చుకుంటే గ్లైసెమిక్ సూచీ తక్కువగా ఉండే వాటికి ప్రాధాన్యత ఇవ్వండి.