White Hair: జుట్టుకు రంగు వేయకండి.. ఈ పండ్ల రసం రాసుకుంటే తెల్ల జుట్టు సహజంగా నల్లగా మారుతుంది..

Update: 2025-04-22 14:49 GMT
White Hair: జుట్టుకు రంగు వేయకండి.. ఈ పండ్ల రసం రాసుకుంటే తెల్ల జుట్టు సహజంగా నల్లగా మారుతుంది..
  • whatsapp icon

White Hair Turn Black: తెల్ల జుట్టు సమస్యతో పోరాడే వారు జుట్టుకు రకరకాల డైలు వేసుకుంటారు. ఈ మార్కెట్లో అందుబాటులో ఉన్న డైలతో కెమికల్ అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో వీరికి సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. తద్వారా తెల్లజుట్టు సమస్య మరింత పెరిగిపోతుంది. అంతేకాదు చుండ్రు, దురద కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఎక్కువ డబ్బులు వెచ్చించి వీటిని జుట్టుకు రాసుకున్న సరైన ఫలితాలు కూడా లభించవు . అయితే తెల్ల జుట్టు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కాలుష్యంతో పాటు సరైన జీవన శైలి పాటించకపోవడం వల్ల తెల్లజుట్టు సమస్య వస్తుంది. మరి కొందరికి ఫ్యామిలీ హిస్టరీ వల్ల కూడా జరగవచ్చు. అయితే సహజసిద్ధంగా తెల్ల జుట్టుని తగ్గించుకునే చిట్కా ఉంది.

ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. తెల్ల జుట్టు సమస్య తగ్గుతుంది. ప్రధానంగా ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా తెల్ల జుట్టు ఆలస్యం అవుతుంది. ఉసిరిని తినటం వల్ల కూడా తెల్ల జుట్టు సమస్య ఆలస్యం చేస్తుంది. ఇందులో ఇమ్యూనిటీ పెంచే గుణాలు ఉంటాయి. ప్రధానంగా ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల జుట్టును తగ్గి చేస్తుంది.

అంతేకాదు ఉసిరిలో ఉండే విటమిన్ సి చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు మెరిసేలా చేస్తుంది. నల్లని, పొడవాటి జుట్టు మీ సొంతం అవుతుంది. ఉసిరి రసాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టు సమస్య తగ్గిపోతుంది. ఆ తర్వాత సాధారణ షాంపుతో తలస్నానం చేయాల్సి ఉంటుంది. ఇలా తరచూ చేయడం వల్ల తెల్ల జుట్టు సమస్య కొన్ని రోజుల్లోనే తగ్గిపోతుంది. ఇలా సహజంగా మీ జుట్టును నలుపు రంగులోకి మార్చుకోవచ్చు. 

Tags:    

Similar News