Heat Stroke: మీ పిల్లలు వడదెబ్బకు గురవ్వకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
Heat stroke Remedies: ఎండ వేడి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో హీట్ స్ట్రోక్ గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ప్రధానంగా పిల్లలు వడదెబ్బకు గురవ్వకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
Heat Stroke: మీ పిల్లలు వడదెబ్బకు గురవ్వకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
Heat Stroke Remedies: పిల్లలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రధానంగా స్కూళ్లకు వెళ్లి రావడం, ఆటలాడుకోవడం వల్ల వడదెబ్బకు గురవుతారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు వడదెబ్బకు రాకుండా నివారించవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా కొన్ని సూచనలు తల్లిదండ్రులకు చేసింది. వాళ్లు పిల్లల ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపింది.
పిల్లలు డిహైడ్రేషన్ గురవ్వకుండా జాగ్రత్త తీసుకోవాలి. ప్రధానంగా నీళ్లు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి. నిమ్మరసం, మజ్జిగ వంటివి కూడా వాళ్ళ డైట్‌లో చేర్చుతారు. తద్వారా వాళ్ళు వడదెబ్బకు గురవ్వకుండా ఉంటారు.
అంతేకాదు వాళ్ళకి కేవలం కాటన్ దుస్తులు మాత్రమే ధరింపచేయండి. తద్వారా హిట్ స్ట్రోక్‌కు గురవ్వకుండా ఉంటారు. సిల్క్ దుస్తులు వాడటం వల్ల వడదెబ్బ ప్రమాదం పెరుగుతుంది.
పిల్లలు బయటికి వెళ్లినప్పుడు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య వాళ్ళని బయటకు వెళ్ళనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోండి. కేవలం ఇండోర్ గేమ్స్‌కు మాత్రమే పరిమితం చేయండి.
పిల్లలకు ప్రధానంగా నీతి శాతం అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు డైట్లో చేర్చండి. కీరదోసకాయ, పుచ్చకాయ, బెర్రీ జాతికి చెందిన పండ్లు వాళ్ళ డైట్‌లో ఉంచాలి. మజ్జిగ, పెరుగు వంటివి కూడా తినిపించాలి.
అంతేకాదు వాళ్ళ గదిలో సరిగ్గా గాలి, వెంటిలేషన్ ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. ఫ్యాన్స్, కూలర్స్, ఏసీలు వినియోగించండి. టెంపరేచర్ ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచాలి. చల్ల నీటితో స్నానం చేయించాలి.
బయటకు వెళ్ళినప్పుడు కచ్చితంగా పిల్లలకు సన్‌స్క్రీన్ అప్లై చేయండి. వాళ్లకు తల తిరుగుడు, వాంతులు వంటివి జరిగినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎక్కువగా నీళ్లు తాగించాలి. పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్ ,గొడుగులు ఉపయోగించాలి తద్వారా వడదెబ్బకు గురవ్వకుండా ఉంటారు
పిల్లలకు తలనొప్పి, నీరసం వంటివి కనిపిస్తే అది వడదెబ్బకు గురైనట్లు సూచన. తద్వారా తక్షణ చర్యలు తీసుకోవాలి. వెంటనే తడిగుడ్డతో ఒళ్లంతా తుడవాలి. కాటన్ దుస్తులు మాత్రమే వాళ్లకు వేయండి. అవసరమైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.