Skin Glow: రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క చుక్క కొబ్బరి నూనెలో కలిపి రాసుకుంటే హీరోయిన్ మించిన అందం

Glowing Skin: ప్రతి ఒక్కరికి బ్యూటిఫుల్ ఫేస్ కావాలనే కోరిక ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు.

Update: 2025-04-13 06:15 GMT
Skin Glow

Skin Glow: రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క చుక్క కొబ్బరి నూనెలో కలిపి రాసుకుంటే హీరోయిన్ మించిన అందం

  • whatsapp icon

Glowing Skin: అందమైన ముఖం కావాలని అందరూ అనుకుంటారు. ఈ నేపథ్యంలో వేలు ఖర్చుపెట్టి పార్లర్ కూడా వెళ్తూ ఉంటారు. వేల ఖర్చు కూడా తప్పదు. అయితే ఇది కేవలం కొన్ని రోజులు మాత్రమే ప్రభావం చూపిస్తుంది. సహజ సిద్ధంగా మీ ముఖం మెరిసిపోవాలంటే ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలను వాడండి. తద్వారా మీరు సహజంగా మెరిసిపోతారు. ప్రధానంగా మీ డే బ్యూటీ రొటీన్ ఎలా ఉంటుందో.. రాత్రి పడుకునే ముందు నైట్ రొటీన్ కూడా అంత జాగ్రత్తలు తీసుకోవాలి. విటమిన్ ఇ క్యాప్స్యూల్ కొబ్బరి నూనెలో కలిపి రాత్రి ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.

విటమిన్ ఇ క్యాప్సిల్ కొబ్బరి నూనెలో కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల ఇది చర్మానికి మంచి హైడ్రేషన్ అందిస్తుంది. ముఖంపై మచ్చలు, గీతాలు రావు. మీ చర్మం పొడిబారకుండా ఉండి ..చర్మం కూడా మెత్తగా ఉంటుంది .

అంతేకాదు ఈ విటమిన్ వాడటం వల్ల ముఖంపై ఉండే మచ్చలు, గీతాలు తొలగిపోతాయి. రాత్రి పడుకునే ముందు కచ్చితంగా అప్లై చేయటం మర్చిపోవద్దు. ఇది సెల్ డ్యామేజ్ కాకుండా పునరుజ్జీవనం అందిస్తుంది. దీనివల్ల అతి తక్కువ సమయంలోనే మీ ముఖం కాంతివంతంగా మారుతుంది.

అంతే కాదు విటమిన్ ఇ లో యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి. ఇందులో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్ వ్యతిరేకంగా పోరాడుతాయి. సూర్యుని హానికర కిరణాల నుంచి రక్షిస్తాయి. దీని తద్వారా ముఖంపై ఉండే గీతలు కూడా కనిపించకుండా మాయమవుతాయి. విటమిన్ ఇ క్యాప్సూల్‌ వాడటం వల్ల మీ స్కిన్ టోన్‌ కూడా మెరుగవుతుంది.

Tags:    

Similar News