Belly Fat: ఈ 3 వేయించిన గింజలతో 15 రోజుల్లో బొడ్డు కొవ్వు తగ్గిపోతుంది..

Belly Fat Burning Tips: రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయకపోవడం ఇతర ఆరోగ్య సమస్యలు వల్ల బొడ్డు కొవ్వు ఎక్కువగా పేరుకు పోతుంది. అంతేకాదు ప్రధానంగా ఎక్కువ సమయం పాటు కూర్చొని వర్క్ చేయడం వల్ల బొడ్డు సమస్య తీవ్రంగా వేధిస్తుంది. ఇలా చేయడం వల్ల జీర్ణ క్రియ కూడా బలహీనపడుతుంది. దీంతో ఇతర ఆరోగ్య సమస్యలు కూడా గురవుతారు. అయితే మూడు గింజలు తీసుకుంటే రెండు వారాల్లో మీరు బొడ్డు కొవ్వు తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
ఈ గింజల ఉదయం మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆ బొడ్డు కొవ్వు తగ్గిపోతుంది. బరువు కూడా పెరగకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
సోంపు గింజలను డైట్లో చేర్చుకోవడం వల్ల ఇది బొడ్డు కొవ్వును తగ్గించేస్తుంది. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వారు కూడా ఈ సోంపు నీటిని ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అతిగా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. తద్వారా ఆకలికి లేకుండా ఉంటుంది. అంతే కాదు మన శరీరంలో ఉండే విష పదార్థాలను సైతం బయటకు పంపుతుంది.
జీలకర్ర..
జీలకర్ర కూడా జీర్ణక్రియను మెరుగు చేస్తుంది. బొడ్డు కొవ్వును తగ్గించేస్తుంది. ఇది క్యాలరీలను బర్న్ చేసే గుణం కలిగి ఉంటుంది. కాబట్టి జీలకర్ర నీటిని కూడా డైట్ లో చేర్చుకోవాలి. తద్వారా జీవక్రియ కూడా మెరుగుపడుతుంది.
మెంతులు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.ఇది బొడ్డు కొవ్వును తగ్గించే గుణం కలిగి ఉంటుంది. ఆ మెంతులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా మాత్రమే కాదు హెయిర్ కేర్ పరంగా కూడా ఎంతో ఉపయోగకరం. మూడు విత్తనాలను కలిపి చిన్న మంటపై వేయించి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో ఈ స్పూన్ పొడి వేసుకొని ఇందులో నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల బొడ్డు కొవ్వు తగ్గిపోతుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితాలు రెండు వారాల్లోనే చూస్తారు. దీంతోపాటు రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ కూడా చేస్తూ ఉండాలి.