Mangoes: ఈ 5 ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మామిడిపండు రసం తీసుకోకూడదు

Mangoes Side Effects: ఎండాకాలం వచ్చింది మామిడిపండు కాలం కూడా మొదలైంది. ఉగాది తర్వాత మామిడి పండ్లు మార్కెట్‌లో ఎక్కువ మొత్తంలో విక్రయాలు జరుపుతున్నారు.

Update: 2025-04-13 11:57 GMT
Mangoes

Mangoes: ఈ 5 ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మామిడిపండు రసం తీసుకోకూడదు

  • whatsapp icon

Mangoes Side Effects: మామిడి పండు అంటేనే పండ్లలో రారాజు. ఇది ఎంతో రుచికరంగా తీయగా ఉంటుంది. ఎండాకాలం వచ్చిందంటే మార్కెట్‌లో పెద్ద మొత్తంలో విక్రయాలు జరుగుతాయి. మామిడిపండు నేరుగా తినవచ్చు లేదా మామిడి షేక్ లేదా కూల్‌డ్రింక్‌, క్రీమీ రూపంలో తయారు చేసుకొని తీసుకుంటారు. ఇది మంచి రిఫ్రెష్మెంట్ కూడా మనకు అందిస్తుంది. ఎంతో రుచికరంగా ఉండే మామిడి పండ్లను అందరూ తినలేరు. ఎందుకంటే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మామిడిపండు రసం తీసుకోకపోవడమే మంచిది.

ప్రధానంగా షుగర్‌తో బాధపడుతున్న వాళ్ళు మామిడిపండు రసం తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులో సహజంగా ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇది తీసుకోగానే రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరిగిపోతాయి. దీంతో ఇది షుగర్ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యం పైతీవ్ర ప్రభావం చూపుతుంది.

అంతేకాదు కొన్ని రకాల అలర్జీ సమస్యలు ఉన్నవాళ్లు కూడా మామిడి పండును తీసుకోరాదు. తద్వారా దురదలు, వాపు, శ్వాస కోశ సమస్యలు కూడా రావచ్చు. ఇది మాత్రమే కాదు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు ప్రధానంగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇక బరువు తగ్గాలనుకునేవారు వీటిని తీసుకోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. బరువు కూడా పెరిగిపోతారు.

ప్రధానంగా జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు కూడా మామిడిపండు తినకూడదు. దీనివల్ల కడుపులో గ్యాస్, అజీర్తి సమస్య వస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగానే ఉంటుంది. కానీ మామిడిపండు షేక్త తయారు చేసేటప్పుడు పాలు కలిపి తయారుచేస్తారు. కాబట్టి ఇది జీర్ణ ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.

ఇక మామిడి పండులో పొటాషియం ఉంటుంది. ఇది శరీర ఆరోగ్యానికి మంచిది. అయితే ఎక్కువ మొత్తంలో తీసుకోవటం వల్ల అసహజ స్పందన సమస్య ఉన్నవాళ్ళకు మంచిది కాదు. ఈ మామిడిపండుతో షేక్ చేసుకుని తీసుకుంటే అందులో చక్కెర వేస్తారు కాబట్టి పంటి ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది..

Tags:    

Similar News