Nuts: గింజలు ఏ సమయంలో తీసుకోవడం సరైంది? నిపుణులు సూచన ఇదే..
Right Time To Take Nuts: ప్రతిరోజు గింజలు డైట్లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అయితే వీటిని తీసుకోవడానికి సరైన సమయం ఏది?

Nuts: గింజలు ఏ సమయంలో తీసుకోవడం సరైంది? నిపుణులు సూచన ఇదే
Right Time To Take Nuts: జీడిపప్పు, బాదం, పిస్తా వంటివి డైట్లో చేర్చుకోవాలి. ఇవి ఆరోగ్యకరమైన స్నాక్ అంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇన్‌ఫ్లమేషన్ సమస్య నుంచి మనం కాపాడుతాయి. అంతే కాదు ఇందులో ఫైబర్ ఆరోగ్యకరమైన కొవ్వులు విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అందుకే ప్రతిరోజు గింజలు మన డైట్‌లో చేర్చుకోవాలని చెబుతారు.
అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం గింజలు తీసుకోవడానికి సరైన సమయంలో తీసుకోవడం వల్ల గరిష్ట లాభాలు పొందుతారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకోవడం వల్ల ఇది చెడు కొలెస్ట్రాల్ తగ్గించేస్తుంది. రక్త పోటును అదుపులో ఉంచుతుంది. అంతేకాదు అదనంగా ఇది రోజంతటికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. నీరసాన్ని తగ్గించేస్తుంది.
ఈ గింజలు మధ్యాహ్నం సమయంలో తీసుకోవటానికి కూడా బెస్ట్. ఎందుకంటే ఇది అతిగా ఆకలి వేయకుండా కడుపు నిండుగా ఉంచుతుంది. తద్వారా అతిగా తినకుండా ఉంటారు. ఇక రాత్రి సమయంలో జీడిపప్పు వంటివి తీసుకుంటే జీర్ణం కావడం మరింత కష్టంగా మారుతుంది. దీంతో కడుపులో అజీర్తి, గ్యాస్ వస్తుంది. ప్రధానంగా ఈ గింజలు తీసుకుంటే ఉప్పు, రోస్ట్ చేయనివి తీసుకోవాలి.
ఉదయం, మధ్యాహ్నం సమయంలో ఈ గింజలను తీసుకోవచ్చు. రాత్రి నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకున్న మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు గింజలు తీసుకోవచ్చు. ఇది బరువుపై ప్రభావం పడదు. అయితే జీర్ణ సమస్యలు ఉన్నవారు మాత్రం కాస్త జాగ్రత్త తీసుకోవాలి.