Health: పుచ్చకాయ తినేప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.? ఏమవుతుందో తెలుసా?
Watermelon: వేసవిలో పుచ్చకాయ తింటే ఎంత ఉపశమనంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమ్మర్‌లో విరివిగా లభించే ఈ పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

Watermelon: వేసవిలో పుచ్చకాయ తింటే ఎంత ఉపశమనంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమ్మర్‌లో విరివిగా లభించే ఈ పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో 90 శాతం నీరు ఉండడంతో శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. కాబట్టి దీనిని వేసవి సూపర్‌ఫుడ్‌గా పిలుస్తారు. ఇది విటమిన్లు, ఖనిజాలతో నిండిన పండు, గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. అయితే పుచ్చకాయ తినే విషయంలో కొన్ని తప్పులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.
* భోజనం చేసిన వెంటనే పుచ్చకాయను తినకూడదు. దీనివల్ల కడుపులో గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి.
* పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగడం జీర్ణక్రియ మందగించడమే కాకుండా, కడుపు ఉబ్బరం, అజీర్ణ సమస్యలను కలిగించవచ్చు.
* మనలో చాలా మంది పుచ్చకాయపై ఉప్పు చల్లుకొని తింటారు. ఇది శరీరంలోని సోడియం స్థాయిని పెంచి, రక్తపోటు సమస్యలకు దారితీస్తుంది.
* చల్లటి పుచ్చకాయ తినడం ఆనందంగా అనిపించినా, ఫ్రిజ్ నుండి తీసిన వెంటనే తింటే గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యలు రావచ్చు. అందువల్ల, కొంతసేపు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన తర్వాతే తినాలి.
* రాత్రిపూట పుచ్చకాయ తినడం శరీరంలో చలి పెంచి, గొంతు నొప్పి, జలుబు సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి పగటి వేళలో, ముఖ్యంగా మధ్యాహ్నం పుచ్చకాయ తినడం ఉత్తమం.
* పుచ్చకాయను అరటిపండు, మామిడి లేదా మిల్క్ షేక్‌లతో కలిపి తినకూడదు. దీనివల్ల కడుపులో కిణ్వ ప్రక్రియ (Fermentation) జరుగుతుంది, ఇది గ్యాస్, ఉబ్బరం సమస్యలకు దారితీస్తుంది.
మరి సరైన విధానం ఏంటంటే:
* పుచ్చకాయను భోజనం చేసే 1-2 గంటల ముందు లేదా తర్వాత తినాలి.
* పగటి సమయంలో, ముఖ్యంగా మధ్యాహ్నం తినడం మంచిది.
* ఫ్రిజ్‌లోంచి తీసిన వెంటనే తినకుండా, కొంతసేపు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన తర్వాతే తినాలి.
* చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, నెమ్మదిగా నమిలి తినాలి. దీని వల్ల జీర్ణ వ్యవస్థకు సహాయపడుతుంది.