Sugar: షుగర్ వ్యాధిగ్రస్తులు నానబెట్టిన బాదం పప్పు తింటే ఏమవుతుందో తెలుసా?
Sugar Control With Almomnds: షుగర్ వ్యాధిగ్రస్తులు సరైన డైట్ పాటించాలి. తద్వారా రక్తంలో షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి.
Sugar Control With Almonds: గింజలు ఆరోగ్యకరం ప్రతిరోజు నానబెట్టిన గింజలను ఉదయం తీసుకోవటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండు. ప్రధానంగా ఈ నానబెట్టిన గింజలు తీసుకుంటే ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. దీంతో సీజనల్ జబ్బులకు వ్యతిరేకంగా మన శరీరం పోరాడుతుంది. అయితే, డయాబెటీస్‌తో బాధపడుతున్నవారు నానబెట్టిన బాదం తింటే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు నానబెట్టిన బాదం పప్పు తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. అంతేకాదు గుండె ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. ప్రధానంగా షుగర్ వ్యాధిగ్రస్తులు కిడ్నీ గుండె సమస్యల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి ఇది వారికి ఆరోగ్యకరం.
షుగర్ వ్యాధిగ్రస్తులు ఎప్పటికప్పుడు చక్కెర స్థాయిలు తనిఖీ చేస్తూ షుగర్ అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే ప్రాణాంతక పరిస్థితులు ఎదురు అవ్వచ్చు. అయితే బాదంలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఒమేగా 3 కాల్షియం పుష్కలంగా ఉంటాయి. తద్వారా ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు బాదం తీసుకోవడం ఎంతో ముఖ్యం కూడా..
అంతేకాదు నానబెట్టిన బాదంపప్పు షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకుంటే కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇక నానబెట్టిన బాదంపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా కలిగి ఉండటం వల్ల ఇది వారి ఆరోగ్యానికి మంచిది. ప్రధానంగా ఒత్తిడి నుంచి బయటపడతారు. ఇందులో ఒమేగా ౩ ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
అంతేకాదు నానబెట్టిన బాదం పప్పు తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య కూడా ఎఫెక్టీవ్‌గా తగ్గిపోతుంది. చర్మానికి మంచి పోషణ అందుతుంది. రాత్రి నానబెట్టిన బాదంపప్పులను తొక్క తీసి ఉదయం పరగడుపున తీసుకోవాలి. తద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి.