Rice Water: రైస్ వాటర్ ఉంటే చాలు.. బాలీవుడ్ బ్యూటీ లాంటి అందం మీ సొంతం..

Rice Water Skin And Hair Benefits: ప్రతి ఇళ్లలో వైట్ రైస్‌ వండుకుంటారు. అయితే ఈ బియ్యం కడిగిన నీటిలో అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. దీంతో కొరియన్‌ వంటి మెరిసే చర్మం, జుట్టు పొందుతారు తెలుసా?

Update: 2025-04-11 03:30 GMT
Rice Water

Rice Water: రైస్ వాటర్ ఉంటే చాలు.. బాలీవుడ్ బ్యూటీ లాంటి అందం మీ సొంతం..

  • whatsapp icon

Rice Water Skin And Hair Benefits: ప్రతి ఇళ్లలో వైట్ రైస్‌ వండుకుంటారు. అయితే ఈ బియ్యం కడిగిన నీటిలో అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. దీంతో కొరియన్‌ వంటి మెరిసే చర్మం, జుట్టు పొందుతారు తెలుసా?

Rice Water Skin And Hair Benefits: రైస్ వాటర్ అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో ఖనిజాలు పుష్కలం ఇది జుట్,టు చర్మానికి ఉపయోగించడం వల్ల నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. మన చర్మానికి వాడటం వల్ల కలిగే ఫలితాలు తెలుసుకుందాం...

చర్మానికి రైస్ వాటర్ ఉపయోగించటం వల్ల సహజమైన కాంతి వస్తుంది. ఇందులో అమైనో యాసిడ్,స్ విటమిన్స్ ఉంటాయి. దీంతో మీ చర్మానికి సహజంగా కాంతివంతం చేసే గుణం కలిగి ఉంటుంది. అంతేకాదు ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ముఖంపై ఉండే యాక్నేను సమర్థవంతంగా తగ్గిస్తుంది.

రైస్ వాటర్‌ రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల ఓపెన్ ఫోర్స్‌ సమస్యలు కూడా తగ్గించేస్తుంది. దీంతో మీ ముఖం మృదువుగా యవ్వనంగా కనిపిస్తుంది. రెగ్యులర్‌గా ఈ నీటిని ముఖానికి అప్లై చేయడం వల్ల ఎండ వల్ల కలిగిన సన్ డ్యామేజ్ కూడా తగ్గిపోతుంది. ఇందులో కూలింగ్ గుణాలు ఉంటాయి. ముఖంపై ఉండే దురదలను కూడా తగ్గిస్తుంది.

రైస్ వాటర్ జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు బలంగా, దృఢంగా మారుతుంది. ఇది జుట్టును బలంగా పెరిగేలా ప్రేరేపిస్తుంది. స్ల్పిట్‌ ఎండ్‌ సమస్య కూడా రాదు. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతూనే ఉంటుంది. ప్రధానంగా ఇది కుదుళ్ల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. తద్వారా మీ జుట్టు ఆరోగ్యంగా పెరుగుతూనే ఉంటుంది.

బియ్యం కడిగిన నీటిని జుట్టుకు ఉపయోగించడం వల్ల సహజంగా మెరుస్తూ కనిపిస్తుంది. అంతేకాదు చుండ్రు సమస్యలు కూడా చెక్‌ పెడుతుంది. ఇది పీహెచ్ స్థాయిలను సమతూలం చేసి చుండ్రు రాకుండా కాపాడుతుంది. దీంతో హెయిర్ ఫాల్ సమస్య కూడా చెప్పి పెట్టొచ్చు.

Tags:    

Similar News