Health Tips: రోజూ అరగంట నడిస్తే ఇన్ని లాభాలా?
What happens to your body if you walk for 30 minutes daily: కేవలం వాకింగ్ వల్ల ఏం లాభం ఉంటుందిలే అని లైట్ తీసుకుంటున్నారా?

Health Tips: రోజూ అరగంట నడిస్తే ఇన్ని లాభాలా?
Health benefits of daily walking: చాలామంది ఆరోగ్యంగా, శరీరం ఫిట్‌గా ఉండాలంటే అతి కష్టమైన వర్కౌట్స్ చేస్తేనే సాధ్యం అవుతుందని అనుకుంటుంటారు. ఇంకొంత మంది కేవలం వాకింగ్ వల్ల ఏం లాభం ఉంటుందిలే అని లైట్ తీసుకుంటుంటారు. కానీ ఇప్పుడు మేం చెప్పే విషయాలు తెలుసుకుంటే మీరు ఈ రోజు నుండే రోజూ 30 నిమిషాలు వాకింగ్ చేయడం మొదలుపెడతారు. వాకింగ్ వల్ల కలిగే అన్ని లాభాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి.
హార్ట్ ఎటాక్స్ రాకుండా హెల్ప్ అవుతుంది
రోజూ అరగంటసేపు వాకింగ్ చేస్తే బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ రెండూ అదుపులో ఉన్నాయంటే హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం కూడా ఉండదు.
అధిక బరువు పెరగకుండా ఉంటుంది
ఈ తరంలో చాలామంది ఎదుర్కుంటున్న సమస్య అధిక బరువు. కానీ రోజూ 30 నిమిషాలు వేగంగా నడిచే వారిలో ఆ సమస్య ఉండదు. ఎందుకంటే వేగంగా నడిచినప్పుడు శరీరంలో ఉండే అధిక కేలరీలు ఖర్చయిపోతాయి. మెటాబాలిజం మెరుగుపడుతుంది. ఫలితంగా బరువు పెరగకుండా ఉంటారు. అధిక బరువు ఉన్న వారు కూడా బరువు తగ్గుతారు.
ఒత్తిడిని దూరం చేస్తుంది
క్రమం తప్పకుండా ప్రతీరోజూ వాకింగ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గి ఉత్సాహం పెరుగుతుంది. ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్ అనే హార్మోన్‌ను వాకింగ్ నివారిస్తుంది. అందుకే నిత్యం వాకింగ్ చేసే వారు చేయని వారితో పోల్చుకుంటే ఎక్కువ ఉత్సాహంగా ఉంటారు.
శక్తిని పెంచుతుంది
ప్రతీ రోజూ నడిచే వారిలో శక్తి ఎక్కువగా ఉంటుంది. వాకింగ్ చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. కండరాలకు వ్యాయామం అవుతుంది. అందుకే అది మీకు శక్తిని పెంచుతుంది.
మైండ్‌కు బూస్ట్
వాకింగ్ అనేది మెదడుకు మంచి బూస్టింగ్‌ను ఇస్తుంది. అందుకు కారణం వాకింగ్ చేసినప్పుడు బ్రెయిన్‌కు మరింత ఆక్సీజన్ సరఫరా అందడమే.
ఆందోళనను దూరం చేస్తుంది
కొంతమందిని యాంగ్జైటీ వేధిస్తుంటుంది. కానీ నిత్యం 30 నిమిషాల పాటు వాకింగ్ చేసే వారిలో ఆ సమస్య చాలా చాలా తక్కువ. వాకింగ్ చేసినప్పుడు నరాల్లోకి రక్త ప్రసరణ, ఆక్సీజన్ సరఫరా పెరగడం వల్లే వారిలో యాంగ్జైటీ రాకుండా ఉంటుంది.
ఊపిరితిత్తుల పని తీరు మెరుగు
రోజూ వాకింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తుల పని తీరు మెరుగుపడుతుంది. శ్వాసకోశ వ్యవస్థ బాగా పనిచేస్తుంది.
విటమిన్ D
జిమ్ లోనో లేక ఇంట్లో ట్రెడ్ మిల్ పై వాకింగ్ చేసే వారి కంటే బయటి వాతావరణంలో వాకింగ్ చేసే వారిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ ఎముకలను బలంగా తయారు చేస్తుంది. వ్యాధినిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది
బ్రెస్ట్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ వంటి జబ్బులను వాకింగ్ నివారించే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అందుకు కారణం రోజూ వాకింగ్ చేసే వారిలో మెటాబాలిజం లెవెల్స్ ఎక్కువగా ఉండటంచో పాటు వ్యాధినిరోధత కూడా ఎక్కువగా ఉంటుంది.