Health: పిల్లల్లో ఆటిజానికి కారణమవుతోన్న స్మార్ట్ ఫోన్.. పరిశోధనలో షాకింగ్ విషయాలు..!
Health: ఆటిజం అనేది నాడీ వ్యవస్థ అభివృద్ధి సంబంధిత సమస్య. దీంతో బాధపడే పిల్లలు సామాజికంగా మెలగడంలో, మాట్లాడటంలో, ప్రవర్తనలో కొన్ని ప్రత్యేక లక్షణాలు చూపిస్తారు.

Health: పిల్లల్లో ఆటిజానికి కారణమవుతోన్న స్మార్ట్ ఫోన్.. పరిశోధనలో షాకింగ్ విషయాలు..!
Health: ఆటిజం అనేది నాడీ వ్యవస్థ అభివృద్ధి సంబంధిత సమస్య. దీంతో బాధపడే పిల్లలు సామాజికంగా మెలగడంలో, మాట్లాడటంలో, ప్రవర్తనలో కొన్ని ప్రత్యేక లక్షణాలు చూపిస్తారు. ఇది ఒక స్పెక్ట్రమ్ డిజార్డర్ కావడంతో ప్రతి వ్యక్తిలోని లక్షణాలు తేడాగా కనిపిస్తాయి. జన్యుపరమైన అంశాలతో పాటు పర్యావరణ పరిస్థితులు కూడా దీనిపై ప్రభావం చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. తాజాగా దీనికి సంబంధించి ఏఐఐఎంఎస్ (AIIMS) నిర్వహించిన ఒక అధ్యయనంలో కొన్ని కీలక విషయాలు వెలుగుచూశాయి.
ఎయిమ్స్ పరిశోధన ప్రకారం ఆటిజంతో బాధపడుతున్న పిల్లల శరీరాల్లో సీసం, పాదరసం, క్రోమియం, మాంగనీస్, కాడ్మియం, రాగి, ఆర్సెనిక్ వంటి భారీ లోహాల మోతాదు అధికంగా ఉన్నట్టు గుర్తించారు. ఈ లోహాలు కాలుష్యభరిత ఆహారం, పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు, గాలిలో కలిసే విష వాయువులు, బొమ్మల ద్వారా పిల్లల శరీరాల్లోకి చేరుతున్నట్టు వెల్లడైంది. ఇవి నాడీ వ్యవస్థ పనితీరును ప్రభావితం చేసి ఆటిజం ప్రమాదాన్ని పెంచుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
స్క్రీన్ సమయం కూడా ప్రమాదమే
పిల్లలు ఎక్కువసేపు మొబైల్, టీవీలను చూడటం కూడా ఆటిజం లక్షణాలను పెంచేలా పనిచేస్తోంది. పిల్లలకు సాధారణంగా రోజుకి కొన్ని గంటలకే పరిమితమైన స్క్రీన్ సమయం అనుమతించాలని నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవానికి, ఆటిజాతో ఉన్న పిల్లల్లో 32 శాతం మందిలో ఈ ఏడురకాల భారీ లోహాల స్థాయి ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. ఆరోగ్యంగా ఉన్న పిల్లలతో పోల్చితే చాలా తేడా ఉంది.
పిల్లల స్క్రీన్ టైమ్‌ను తగ్గించాలంటే ఈ చర్యలు తీసుకోవాలి:
రోజుకి స్క్రీన్ సమయానికి స్పష్టమైన పరిమితి పెట్టండి. పిల్లలను సైకిల్ రైడింగ్, క్రీడలు వంటి ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి. పెయింటింగ్, సంగీతం, నృత్యం వంటి వాటిని అలవాటు చేయాలి. కుటుంబంతో కలసి సమయం గడిపే అలవాటు కల్పించండి. పర్యటనలు, నడకలు, పార్కులో ఆటలు వంటి కార్యక్రమాల ద్వారా స్క్రీన్ నుండి దూరంగా ఉంచండి.
ఆటిజాన్ని ఎలా తగ్గించాలి.?
ఆటిజం పూర్తిగా నివారించదగినది కాదు. కానీ, సరైన జీవనశైలి, స్వచ్ఛమైన పరిసరాలు, పరిమిత స్క్రీన్ సమయం వంటి అంశాలు అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పిల్లల ఆరోగ్యాన్ని కాపాడటంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం. వారు ఆరోగ్యంగా ఎదగాలంటే, పరిసరాలపై అవగాహన పెంచుకోవాలి.
నోట్: ఈ వివరాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.