Lifestyle: రోజూ స్నానం చేయడం మంచిది కాదా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే
Daily Bathing Effects: స్నానం మన రోజువారీ దినచర్యలో కీలకమైన అంశం. కొంతమంది ఉదయం స్నానం చేస్తే ఉల్లాసంగా ఫీలవుతారు, మరికొందరు రాత్రి కూడా స్నానం చేస్తుంటారు.
Lifestyle: రోజూ స్నానం చేయడం మంచిది కాదా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే
Daily Bathing Effects: స్నానం మన రోజువారీ దినచర్యలో కీలకమైన అంశం. కొంతమంది ఉదయం స్నానం చేస్తే ఉల్లాసంగా ఫీలవుతారు, మరికొందరు రాత్రి కూడా స్నానం చేస్తుంటారు. అయితే ప్రతీ రోజూ స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదంటే మీరు నమ్ముతారా.? ఇంతకీ నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయంలో వైద్య చర్మ నిపుణుడు డాక్టర్ రోసలిండ్ సింప్సన్ ది గార్డియన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడారు. రోజూ స్నానం చేయడం వల్ల కలిగే ప్రభావాలపై తన పరిశోధన వివరించారు. డాక్టర్ సింప్సన్ మాట్లాడుతూ.. తరచుగా స్నానం చేయడం చర్మానికి హాని చేయొచ్చని చెప్పారు. చర్మానికి అవసరమైన సహజ నూనెలు, రక్షణ బ్యాక్టీరియా తొలగిపోతే, పొడిబారడం, పగుళ్లు, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని అన్నారు.
అలాగే, ఎక్కువసేపు నీటిలో ఉండటం వల్ల చర్మం ఇంకా పొడిగా మారుతుందని పేర్కొన్నారు. చల్లటి నీటితో తక్కువ సమయం స్నానం చేయడం మంచిదని సూచించారు. కడుక్కోవడానికి సాధారణ సబ్బుల స్థానంలో ఎమోలియంట్ క్రీమ్‌ను ఉపయోగించాలని సూచించారు, ఎందుకంటే కొన్ని సబ్బుల్లో మిథైలిసోథియాజోలినోన్, మిథైల్క్లోరోఇసోథియాజోలినోన్, సల్ఫేట్లు, పారాబెన్లు వంటి హానికరమైన పదార్థాలు ఉంటాయి.
డాక్టర్ సింప్సన్ బృందం 438 ఎగ్జిమా రోగులపై అధ్యయనం చేసింది. వారిని రెండు గ్రూపులుగా విభజించారు—ఒకరు ప్రతిరోజూ స్నానం చేసేవారు, మరొకరు వారానికి కొన్ని రోజులు మాత్రమే స్నానం చేసేవారు. ఫలితంగా రెండు గ్రూపుల మధ్య చర్మ పొడిబారడం లేదా అలర్జీ సమస్యలలో గణనీయమైన తేడా కనిపించలేదని వెల్లడైంది. రోజూ స్నానం చేయడం తప్పు కాదని, కానీ ఎక్కువసేపు వేడి నీటిలో ఉండడం మేలు కాదని నిపుణులు చెబుతున్నారు. తేమను కాపాడుకోవాలంటే, స్నానం తర్వాత మాయిశ్చరైజర్ ఉపయోగించాలని, హానికరమైన కెమికల్స్ ఉన్న సబ్బులకు బదులుగా సహజ ఉత్పత్తులను ఉపయోగించాలని సూచిస్తున్నారు.