Chia Seeds: ఈ గింజ తింటే గుండె జబ్బులు రావు.. ఎప్పటికీ మీ నడుం సైజు జీరో దాటదు..

Chia Seeds Benefits: ప్రతి ఒక్కరూ బరువు తగ్గాలని అనేక ప్రయత్నాలు చేస్తారు. అయితే దీనికి ఎక్సర్‌సైజుతోపాటు కొన్ని సూపర్ ఫుడ్స్ కూడా డైట్లో చేర్చుకోవాలి.

Update: 2025-04-06 09:30 GMT
Chia Seeds

Chia Seeds: ఈ గింజ తింటే గుండె జబ్బులు రావు.. ఎప్పటికీ మీ నడుం సైజు జీరో దాటదు..

  • whatsapp icon

Chia Seeds Benefits: చియా సీడ్స్ మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఇందులోని ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో అందిస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతే కాదు వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వారికి మంచిది.

క్యాలరీలు తక్కువగా ఉండే చియా విత్తనాలు డైట్‌లో చేర్చుకుంటే కడుపు నిండిన అనుభూతి కూడా కలుగుతుంది. అంతేకాదు ఈ ఎండాకాలం కడుపుకు చల్లదనాన్ని అందిస్తుంది. చియా విత్తనాలు నానబెట్టిన నీటిని ఎండాకాలం రెగ్యులర్ గా తీసుకోవడం ఆరోగ్యకరం.

అంతేకాదు ఆరోగ్యకరమైన పేగు కదలికల కూడా చియా విత్తనాలు తీసుకోవాలి. ఇందులో కరగని ఫైబర్స్ ఉంటాయి. జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది. అంతే కాదు కడుపులో మంచి బ్యాక్టిరియా పెరిగేలా ప్రేరేపిస్తుంది. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవాళ్లు ఇవి తీసుకోవాలి.

చియా విత్తనాలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ఇది ఆకలిని నిరోధిస్తుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చియా విత్తనాలు రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల ఇది మెటబాలిజం రేటును పెంచుతుంది. ఫైబర్ ప్రోటీన్ కూడా అధిక మోతాదులో ఉంటుంది. కండరాల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. కండరాల ఆరోగ్యానికి ప్రేరేపిస్తుంది. బరువు కూడా సులభంగా తగ్గిపోతారు. అంతేకాదు విత్తనాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా కలిగి ఉంటుంది. ఇది మెటబాలిజం రేటును కూడా పెంచుతుంది. ఒబేసిటీని సమర్థవంతంగా తగ్గిస్తుంది.

చియా విత్తనాలను స్మూథీలా చేసుకొని తినొచ్చు లేదా యోగార్ట్‌లా కూడా కలిపి తీసుకోవచ్చు. రాత్రంతా నీళ్లు లేదు పాలలో కూడా కలిపి పుడ్డింగ్‌ మాదిరి కూడా తీసుకోవచ్చు. రాత్రంతా నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రధానంగా ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.

Tags:    

Similar News