Unlucky Plant: మీ ఇంట్లో ఈ 5 మొక్కలు ఉంటే దురదృష్టం అడ్రస్ వెతుక్కుంటూ మరీ వస్తుంది

Unlucky Plants Inauspicious: అందరూ ఇళ్లలో ఏదో ఒక మొక్క పెట్టుకుంటారు. ప్రధానంగా హిందూ సంప్రదాయంలో ప్రతి ఇంట్లో తులసి మొక్క, కలబంద, మందార వంటి మొక్కలు పెంచుకుంటారు.

Update: 2025-04-06 05:30 GMT
Unlucky Plant

Unlucky Plant: మీ ఇంట్లో ఈ 5 మొక్కలు ఉంటే దురదృష్టం అడ్రస్ వెతుక్కుంటూ మరీ వస్తుంది

  • whatsapp icon

Unlucky Plants Inauspicious: ఇంట్లో కొన్ని మొక్కలు ఉంటాయి. అందులో కొన్ని ఆధ్యాత్మికంగా పూజిస్తారు. మరికొన్ని ఇంటికి అందాన్ని ఇస్తాయి. అంతేకాదు మొక్కలు ఉన్న పరిసర ప్రాంతాల్లో ఆక్సిజన్ కూడా విరివిగా లభిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఇళ్లలో ఏదో ఒక మొక్క తప్పనిసరిగా పెట్టుకుంటారు. అయితే ఇంటికి దురదృష్టాన్ని తీసుకువచ్చే కొన్ని మొక్కలు ఉన్నాయి. అవి పొరపాటున కూడా మీ ఇంట్లో పెట్టుకోకూడదు. లేదంటే దురదృష్టం మీ ఇంటి అడ్రస్ వెతుక్కుంటూ మరీ వస్తుందంట ఆ మొక్కలు ఏంటో తెలుసుకుందాం.

ఈరోజుల్లో ఇల్లు లేదా ఫ్లాట్స్‌లో కచ్చితంగా మొక్కలు పెట్టుకుంటారు. అయితే ఇలాంటి మొక్కలు పెట్టుకోవడం వల్ల ఇంట్లో పాజిటివిటీ పెరుగుతుంది. అయితే, మరికొన్ని మొక్కలు పెట్టుకోవడం వల్ల ఇంట్లో దురదృష్టం వస్తుంది. ఇంట్లోకి నెగెటివిటీ ఆహ్వానించే మొక్కల జాబితా ఇదే.

ముళ్ల మొక్కలు..

ఇంటి ఆవరణలో పొరపాటున కూడా ముళ్ల మొక్కలు నాటకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలాంటి మొక్కలు ఇంట్లో ఉంటే నెగటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తాయి. పత్తి మొక్క ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. ఆ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కూడా పెరగదు. నిత్యం గొడవలు జరుగుతాయట.

కాటన్ ప్లాంట్..

ఇంట్లో పొరపాటున కూడా పత్తి చెట్టు పెట్టుకోకూడదు. ఇది ఇంటికి దురదృష్టాన్ని ఆహ్వానిస్తుంది. ఇంటి ప్రాంగణంలో కూడా ఈ మొక్క ఉంటే వెంటనే తీసేయండి. ఇది ఇంటి కుటుంబ సభ్యులపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మీ ఎదుగుదలకు ఇది అడ్డుకట్టగా ఉంటుంది.

బోన్సాయి మొక్క..

బోన్సాయ్ మొక్క కూడా చాలామంది అలంకరణగా పెట్టుకుంటారు. ఇది కొత్త ట్రెండ్ అయింది. కానీ ఈ మొక్కలు ఇంటికి దురదృష్టాన్ని తీసుకువస్తాయి. వాస్తు ప్రకారం ఇలాంటి మొక్కలు ఇంటి అభివృద్ధికి అడ్డుకట్ట ఇంట్లో నెగటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తాయి.

గోరింట మొక్క..

గోరింటాకు ఏవైనా శుభ కార్యాలు ఉంటే చేతికి పెట్టుకుంటారు. కానీ ఈ మొక్క ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు. ఇలాంటి మొక్క ఇంటికి అశుభం. హిందూ సంప్రదాయాల ప్రకారం గోరింట మొక్క ఇంటి చుట్టుముట్టు ప్రాంతాల్లో కూడా ఉండకూడదు.

Tags:    

Similar News