Papaya: చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసే బొప్పాయి ఫేస్ స్క్రబ్.. మీ ముఖానికి మ్యాజికల్ గ్లో
Papaya Exfoliaton Scrub: బొప్పాయి ఆరోగ్యకరం మాత్రమే కాదు.. ఇందులో చర్మానికి పోషకాలు ఇచ్చే గుణం కూడా ఉంది అది ఎలానో తెలుసుకుందాం.

Papaya: చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసే బొప్పాయి ఫేస్ స్క్రబ్.. మీ ముఖానికి మ్యాజికల్ గ్లో
Papaya Exfoliaton Scrub: బొప్పాయిలో పప్పైనా అనే ఎంజైమ్ కూడా ఉంటుంది. ఇది జీర్ణం ఎంజైమ్‌ల ఉత్పత్తికి తోడ్పడుతుంది. అంతేకాదు ఇది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిది. ముఖ్యంగా మహిళలకు వరమని చెప్పాలి. ప్రతిరోజు వారు డైట్ లో చేసుకున్నా మంచిది. అయితే బొప్పాయి ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందానికి కూడా మేలు చేస్తుంది. బొప్పాయితో ముఖానికి స్క్రబ్ తయారు చేసుకుంటే మంచి ఎక్స్‌ఫోలియేషన్ అందిస్తుంది. ఎందుకుంటే ఇందులో ముఖాన్ని సహజసిద్ధంగా కాంతివంతంగా చేసే లక్షణాలు ఉంటాయి.. అయితే ఈరోజు బొప్పాయితో స్క్రబ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
బొప్పాయిలో సహజంగా చర్మాన్ని కాంతివంతం చేసే గుణం ఉంటుంది. ఇందులో సహజసిద్ధమైన ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని సులభంగా ఎక్స్‌ఫోలియేట్ చేసి మంచి పోషకాలు కూడా ఉంటాయి.
బొప్పాయి స్క్రబ్ తయారు చేసుకునే విధానం..
పండిన బొప్పాయి అర కప్పు తీసుకొని దాన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ చక్కెర, తేనే వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మంచి ఎక్స్‌ఫోలియేషన్ తయారు అవుతుంది. దీంతో ముఖాన్ని సర్క్యూలర్ మోషన్‌లో రుద్దడం వల్ల చర్మం పై ఉండే మలినాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.
అంతేకాదు ఈ టేబుల్ స్పూన్ యోగార్ట్, నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల కూడా ముఖానికి మంచి మాయిశ్చర్ అందుతుంది. నిమ్మకాయలోని గుణాలు ముఖానికి కాంతివంతంగా మారుస్తాయి. దీన్ని కాసేపటి వరకు ముఖంపై బాగా స్క్రబ్ చేసి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. పండిన బొప్పాయిలో అలోవెరా, రోజ్ వాటర్ కూడా కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవచ్చు. తద్వారా ముఖానికి మంచి గ్లో అందిస్తుంది. ముఖం బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. తక్షణ మెరుగైన ఫలితాలు బొప్పాయి అందిస్తాయి.