Hanuman Jayanthi 2025: హనుమాన్‌ జయంతి ఎప్పుడు? పూజా విధానం, సరైన సమయం ఇదే..!

Hanuman Jayanthi 2025 Date: హనుమాన్ జయంతి ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీ పౌర్ణమి తిథి నాడు జరుపుకుంటున్నారు. చైత్ర మాసంలో పౌర్ణమి తిథి రోజు ప్రతి ఏడాది హనుమాన్ జయంతి నిర్వహిస్తారు.

Update: 2025-04-08 08:15 GMT
Hanuman Jayanthi 2025 When is it Rituals Pooja Vidhanam and the Right Time to Celebrate

Hanuman Jayanthi 2025: హనుమాన్‌ జయంతి ఎప్పుడు? పూజా విధానం, సరైన సమయం ఇదే..!

  • whatsapp icon

Hanuman Jayanthi 2025 Date: శ్రీరామనవమి జరిగిన వారం రోజులకు ప్రతి ఏడాది హనుమాన్ జయంతిని నిర్వహిస్తారు. చైత్రమాసంలో శుక్ల పక్ష పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి చేయడం ఆనవాయితీ. దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అయితే హనుమాన్ జయంతి ఈసారి ఏప్రిల్ 12వ తేదీ వచ్చింది. ఇది తెల్లవారుజాము 3:00 గంటల నుంచి ఏప్రిల్ 13 ఉదయం 5:51 గంటల వరకు ఉంటుంది.

హిందువులు ఎంతో వేడుక జరుపుకునే హనుమాన్ జయంతి అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఆరోజు సీతారాములను కూడా పూజిస్తారు. సింధూరం, తమలపాకుతో హనుమంతుడికి అష్టోత్తరం చదవాలి. ఇక హనుమాన్ చాలీసా చదవడం కూడా ఆరోజు విశిష్టతతో కూడుకున్నది. సుందరకాండ పారాయణం చేస్తారు. ఇక హనుమాన్ జయంతి రోజు తమలపాకు దండ వడమాల సమర్పించడం ఆనవాయితీ. హనుమంతునికి సింధూరం, ఎర్ర పూలు, తులసి దళాలు సమర్పిస్తారు. నిద్రలేచి స్నానం చేసి ఎర్రని వస్త్రాలు ధరించి ఇవన్నీ హనుమంతుని కోసం చేయాలి. ప్రసాదంగా శనగలు, బూందీ లడ్డు వంటివి సమర్పిస్తారు.

హనుమంతుడు అమరుడు. ఎనిమంది చిరంజీవుల్లో ఒకడు. భక్తిశ్రద్ధలతో ఆయనను ఆరాధిస్తే కష్టాల నుంచి మనల్ని బయటపడేస్తాడు. ప్రధానంగా ఈరోజు హనుమాన్ చాలీసా పఠించడం ఎంతో మంచిది. తద్వారా విజయాలను అందిపుచ్చుకుంటారు. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. సుందరకాండ పారాయణం కూడా ప్రాముఖ్యత ఉంది.

Tags:    

Similar News