Kitchen Tips: వేసవి వేడిని తట్టుకోవాలంటే కిచెన్‌లో ఈ 5 పనులు ఇప్పుడే చేయండి..!
Beat The Heat with Kitchen Tips: మండు వేసవికాలం వచ్చింది. దీంతో విపరీతమైన ఉక్కపోత కూడా పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్ల ఈ వడగాలులు వంటివి వస్తున్నాయి.

Kitchen Tips: వేసవి వేడిని తట్టుకోవాలంటే కిచెన్‌లో ఈ 5 పనులు ఇప్పుడే చేయండి..!
Beat The Heat with Kitchen Tips: వాతావరణంలో తేమ తగ్గిపోవడం విపరీతమైన ఉక్కపోత వల్ల వడదెబ్బ కొట్టే అవకాశం ఉంది. వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి కూల్ డ్రింక్స్ ఇతర ఆహారాలు తీసుకుంటారు. అయితే మన డైట్ లో కూడా కడుపుకు చల్లదనాన్ని అందించే కూరగాయలు, ఆకుకూరలు మాత్రమే తీసుకోవాలి. ఇది కాకుండా కిచెన్‌లో ఈ ఐదు మార్పులు చేసుకుంటే కూడా వేసవి వేడి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.
వాటర్ ప్యూరిఫైయర్ ..
ఎండాకాలం నీరు అధికంగా తీసుకోవాలి. ఈ నేపథ్యంలో వాటర్ ప్యూరిఫైయర్ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వేడి ఎక్కువగా అవ్వటం వల్ల నీళ్ల వల్ల కొన్ని వ్యాధులు సోకే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్యూరిఫైయర్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి. నెలలో కనీసం ఒక్కసారైనా వాటర్ ప్యూరిఫైయర్ శుభ్రం చేయాలి. తద్వారా అందులో ఉండే బ్యాక్టీరియా తొలగిపోతుంది. ఎండ వేడిమి లో ఈ బ్యాక్టీరియా మరింత త్వరగా పెరిగిపోతుంది.
మట్టి పాత్రలు..
మట్టి పాత్రలో సహజ సిద్ధంగా మెగ్నీషియం, కాల్షియం ఉంటుంది. మన పూర్వీకుల కాలం నుంచి మట్టి పాత్రలను ఉపయోగిస్తారు, ఆరోగ్యకరం. ఇందులో నీటిని, ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మంచివి. బాటిల్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవి శరీరానికి సహజసిద్ధంగా చల్లదనాన్ని అందిస్తాయి వీటిని ఇంటికి తెచ్చుకోవాలి.
ఎకో ఫ్రెండ్లీ కిచెన్ ..
ఇది మాత్రమే కాదు మీ ఇంట్లో వేడి తగ్గాలంటే మీ వంట గదిలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులను తగ్గించేయండి. ఎలక్ట్రిసిటీని కూడా ఎక్కువగా ఉపయోగించకూడదు. అప్పుడు ఆ ప్రాంతంలో చల్లదనం పెరుగుతుంది. ప్రధానంగా నీళ్లు తాగాలంటే కేవలం మట్టి పాత్రలోనే ఉపయోగించండి.
ఎండాకాలంలో కిచెన్‌లో చిన్న చిన్న పెస్టులు, బొద్దింకలు వంటివి పెరిగిపోతాయి. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు కిచెన్ శుభ్రం చేసుకోండి. ఎండ వేడిమి సమయంలో కిచెన్ నుంచి దుర్వాసన కూడా వస్తుంది. ఈ సందర్భంగా వెనిగర్, నిమ్మరసం ఇతర ఆయిల్స్ కలిపి శుభ్రం చేసుకోవాలి. ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు మూత పెట్టి ఉంచండి. ఇది మాత్రమే కాకుండా బిరియాని ఆకు, లవంగాలను మీ పప్పు డబ్బాలలో వేసి ఉంచండి. తద్వారా పురుగు చేరకుండా ఉంటుంది.
ఉల్లి, వెల్లుల్లి ..
ఉల్లి, వెల్లుల్లి మాత్రమే కాదు బంగాళదుంపలను కూడా గాలి ఆడే డబ్బాలో వేసి పెట్టండి. ఇక అల్లం వెల్లుల్లి పొట్టు తీసినది మాత్రమే ఫ్రిజ్‌లో నిల్వ ఉంచాలి. ఇక ఉల్లిపాయలు, బంగాళదుంపలు మాత్రం డబ్బాలో కలిపి పెట్టకూడదు. త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది.