Mango: సమ్మర్‌లో కూల్ కూల్.. మామిడితో చేసే ఈ డ్రింక్స్‌ను తప్పక ట్రై చేయండి!
Mango: పండ్లలో రారాజు మామిడి రుచికి నిధి మాత్రమే కాదు. అనేక విటమిన్లు, ఖనిజాలకు కూడా మంచి మూలం.

Mango: సమ్మర్‌లో కూల్ కూల్.. మామిడితో చేసే ఈ డ్రింక్స్‌ను తప్పక ట్రై చేయండి!
Mango: పండ్లలో రారాజు మామిడి రుచికి నిధి మాత్రమే కాదు. అనేక విటమిన్లు, ఖనిజాలకు కూడా మంచి మూలం. ఇందులో పొటాషియం, ప్రోటీన్, విటమిన్ సి, ఫైబర్, కాల్షియం, బి కాంప్లెక్స్, మెగ్నీషియం, ఐరన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పండిన మామిడి మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. వివిధ పదార్థాలతో తయారుచేసిన మామిడి డ్రింక్స్ దాని రుచిని అనేక రెట్లు పెంచుతాయి. ఈ కథనంలో మామిడితో చేసే నాలుగు రకాల డ్రింక్స్ రెసిపీలను చూద్దాం.
మామిడి అంటే పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టమే. దీంతో అనేక రకాల డెజర్ట్‌ల నుండి డ్రింక్స్ వరకు తయారు చేస్తారు. మీకు కూడా మామిడి పండు బాగా ఇష్టం అయితే ఇక్కడ ఇచ్చిన మామిడితో చేసే డ్రింక్స్‌ను ఈ వేసవిలో తప్పకుండా ప్రయత్నించాలి.
మ్యాంగో షేక్
పండిన మామిడి తొక్క తీసి గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకోండి. దానిని మిక్సీలో వేసి కొద్దిగా చక్కెర, పాలు కలపండి. బాగా మెత్తగా గ్రైండ్ చేయండి. ఇందులో కొద్దిగా ఐస్ వేసి మరో ఒకటి రెండు సార్లు బ్లెండర్‌ను తిప్పండి. గ్లాసులో పోసి, తరిగిన నట్స్ మరియు డ్రై ఫ్రూట్స్‌ను కలపండి.
మ్యాంగో-కోకోనట్ మొజిటో
రిఫ్రెష్ డ్రింక్ కోసం చూస్తున్నట్లయితే, మీరు మ్యాంగో మొజిటో తయారు చేసుకోవచ్చు. దీని కోసం మామిడిని బ్లెండ్ చేసిన తర్వాత అందులో నిమ్మరసం వేయండి. కొద్దిగా నల్ల ఉప్పు, చిటికెడు నల్ల మిరియాలు కలపండి. కొబ్బరి నీళ్లు వేసి ఐస్ వేసి ఆస్వాదించండి.
మ్యాంగో లస్సీ
మామిడి లస్సీ రుచి అద్భుతంగా ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి మామిడి గుజ్జును తీసి పెరుగు, చక్కెరతో బ్లెండ్ చేయండి. తర్వాత కొద్దిగా యాలకుల పొడి, తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి ఐస్ క్యూబ్స్ వేయండి లేదా ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా అయిన తర్వాత సర్వ్ చేయండి.
మ్యాంగో మింట్ టేస్టీ డ్రింక్
మామిడిని చిన్న ముక్కలుగా కట్ చేయండి. దానిని పుదీనా ఆకులు, కొద్దిగా నీటితో గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఒక గ్లాసులో నిమ్మకాయ ముక్కలు వేసి నల్ల ఉప్పు వేయండి. దానిని మెత్తగా చేయండి. గ్లాసులో ఐస్ క్యూబ్స్ వేయండి. రెండు చెంచాల లేదా రుచికి తగినంత తయారుచేసిన ప్యూరీ వేసి టేస్టీ మ్యాంగో మింట్ డ్రింక్‌ను తాగండి.